చంద్రబాబుకు ఏదో అయ్యింది

అవును అలాగే అనుకుంటున్నారు ఇపుడందరు. ఒకసారి మాట్లాడిన మాటను వెంటనే మార్చేస్తున్నారు. ఒకసారి తాను కాదంటారు. మరోసారి తానే అంటారు. తాజాగా అటువంటి ఘటనే  గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూడా జరిగింది. తెలంగాణా ఎన్నికల్లో శేరిలింగం పల్లిలో గురువారం రాత్రి రోడ్డుషో చేశారు.  గతంలో హైదరాబాద్ ను తానే నిర్మించానని ఎన్నోసార్లు చెప్పుకున్నారు. దానిపై కెసియార్ తనదైన స్టైల్లో ఎన్నోసార్లు ఘాటు రిప్లై కూడా ఇచ్చారు. ప్రస్తుతం రోడ్డు షో సందర్భంగా మాట్లాడుతూ, హైదరాబాద్ ను తాను కట్టలేదని కేవలం సైబరాబాద్ అనే ప్రాంతాన్ని మాత్రమే నిర్మించానని చెప్పుకున్నారు.

 

మొత్తానికి కెసియార్ దెబ్బ చంద్రబాబుపై బాగా తగిలిందని అంతా అనుకున్నారు. కానీ ఇంతలోనే మళ్ళీ మాట మార్చారు. ఆధునిక తెలంగాణాను తానే సృష్టించానంటూ గొప్పలు చెప్పుకున్నారు. తెలంగాణాలో ఆధునికమని పురాతనమని రెండు లేవు. ఉన్నది ఒకటే తెలంగాణా. నిజానికి ఉమ్మడి ఏపిలో ఐటి రంగానికి బాగా ప్రోత్సాహమిచ్చింది చంద్రబాబు అనే చెప్పాలి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఒక చిన్న ప్రాంతాన్ని ఐటి సంస్ధలకు కేటాయించి ఆ ప్రాంతానికి సైబరాబాద్ అని పేరు పెట్టారు.

 

అంటే ఇఫుడందరూ చూస్తున్న సైబరాబాద్ ప్రాంతం డెవలప్మెంటుకు ఆధ్యుడు మాత్రం చంద్రబాబనటంలో సందేహం లేదు. ఆ విషయాన్ని చంద్రబాబు గుర్తించకుండా మొత్తం హైదరాబాద్ ను తానే అభివృద్ధి చేశానని, తెలంగాణా మొత్తం తన హయాంలోనే అభివృద్ధి జరిగిందని చెప్పుకోవటంతోనే సమస్యలు వస్తున్నాయి. పనిలో పనిగా ఔటర్ రింగురోడ్డు, శంషాబాద్ విమానాశ్రాన్ని నిర్మించింది కూడా తానే అంటూ చెప్పుకోవటంతో అందరూ ఆశ్చర్యపోయారు.

 

ఔటర్, రింగ్ రోడ్డు, శంషాబాద్ విమానాశ్రయం ఏర్పాటు క్రెడిట్ పూర్తిగా దివంగత సిఎం వైఎస్సార్  కే దక్కుతుంది. 2003లో వైఎస్ సిఎం అవగానే ఔటర్ రింగ్ రోడ్డు, శంషాబాద్ నిర్మాణాలు మొదలై పూర్తయిపోయాయి కూడా. అందుకే శంషాబాద్ విమానాశ్రయానికి వైఎస్ రాజీవ్ గాంధి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టని పేరు పెట్టారు. విమానాశ్రయం నిజంగానే చంద్రబాబు కట్టుంటే దానికి రాజీవ్ గాంధి పేరు పెట్టుండేవారా ? మొన్నటికి మొన్న విశాఖపట్నం విమనాశ్రయంలో జగన్ పై జరిగిన హత్యాయత్నాన్నొ డ్రామాగా కొట్టిపారేశారు. తర్వాత అన్నీ వైపుల నుండి వచ్చిన విమర్శలకు భయపడి హత్యాయత్నం ఘటనను తాను డ్రామా అని ఎప్పుడూ అనలేదని బుకాయించారు. ఇవన్నీ చూస్తుంటే చంద్రబాబుకు ఏదో అయ్యిందని అనుకుంటున్నారు.