ఓ మనిషికి ఇన్ని అనారోగ్య సమస్యలు వుంటాయా.? అని ఆశ్చర్యపోతున్నారంతా.! తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడికి ఫలానా ఆరోగ్య సమస్యలున్నాయంటూ వైద్యులు ఇచ్చిన నివేదిక అలా వుంది మరి.! నివేదికను నేరుగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి చంద్రబాబు తరఫు న్యాయవాదులు అందించారు.
ఈ రోజుల్లో డయాబెటిస్ కామన్.! చంద్రబాబుకి అది అదుపులోనే వుంది.! కాకపోతే, గుండె సంబంధిత సమస్య వుందట. రక్తం పంపింగ్ అనేది కాస్త నెమ్మదిగా జరుగుతోందిట. దీనికి గతంలోనూ చంద్రబాబు చికిత్స తీసుకున్నారట.
చర్మ సంబంధిత సమస్యలు సహా అనేకానేక ఇతర సమస్యలూ చంద్రబాబుకి వున్నాయి. వాటిని సవివరంగా, హైకోర్టుకు అందించిన నివేదికలో వైద్యులు పేర్కొనడం గమనార్హం. ఇన్ని అనారోగ్య సమస్యలున్నాయ్ కదా.. చంద్రబాబు ఎలా రాజకీయం చేయగలరు.?
ఇప్పుడు చేస్తున్నదీ రాజకీయమే. బెయిల్ కోసం నానా రకాలుగా ప్రయత్నించి, విఫలమై.. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో రోజుల తరబడి, వారాల తరబడి జైల్లో వున్న చంద్రబాబు, అనారోగ్య కారణాలతోనే మద్యంతర బెయిల్ పొందారు.
ఇక, ఇప్పుడు కొత్తగా పేర్కొన్న అనారోగ్య సమస్యలను చూపించి, మరికొన్నాళ్ళు బెయిల్ పొడిగించేలా అభ్యర్థించనున్నారన్నమాట న్యాయస్థానానికి. మరి, న్యాయస్థానం ఒప్పుకుంటుందా.? అదైతే ప్రస్తుతానికి సస్పెన్స్.
ఆ సంగతి పక్కన పెడితే, ఇన్ని అనారోగ్య సమస్యలు వున్న ఓ వ్యక్తి, ఓ రాజకీయ పార్టీని నడపగలడా.? ఓ ప్రభుత్వాన్ని నడిపే శక్తి వుంటుందా.? ఆంధ్రప్రదేశ్ ఓటర్ల మదిలో మెదులుతున్న ప్రశ్న ఇది.