ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ పై హత్యాయత్నం పక్కా పధకం ప్రకారమే జరిగిందని విశాఖ పోలీస్ కమిషనర్ మహేష్ చంద్ర లడ్డా వెల్లడించారు. ఈ విషయంపై ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పలు షాకింగ్ విషయాలు వెల్లడించారు. ఆ వివరాలు తెలియాలంటే కింద ఉన్న మ్యాటర్ చదవండి.
నిందితుడు జనుపల్లి శ్రీనివాస్ జగన్ పై దాడి చేసేందుకు రెండుసార్లు పధకం వేసాడని మహేష్ తెలిపారు. శ్రీనివాస్ 2017 నుండే జగన్ హత్యపై పధకాలు రచిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. అక్టోబర్ 18 నే జగన్ పై దాడికి ప్లాన్ వేసాడు శ్రీనివాస్. కానీ ఆయన అక్టోబర్ 17 న జగన్ విశాఖ నుండి వెళ్లిపోవడంతో అతని ప్లాన్ వర్కౌట్ కాలేదు. ఇక తన ప్లాన్ ని పోస్టుపోన్ చేసుకున్నాడు శ్రీనివాస్.
కర్ణాటకలో తనతో కలిసి పని చేసిన వేంకటపతి ద్వారా 2018 జనవరిలో ఫ్యూషన్ ఫుడ్స్ లో చేరాడు శ్రీనివాస్. కర్ణాటక, కువైట్ ఓ వెల్డర్ గా, హైదరాబాద్, బళ్లారి, రాజమండ్రి, అమలాపురంలో కుక్ గా పని చేసిన శ్రీనివాస్ దాడి చేసేందుకే ఎయిర్పోర్ట్ లో జాయిన్ అయ్యాడని అన్నారు సీపీ. విశాఖ ఎయిర్పోర్టులో కూడా జగన్ పై పధకం ప్రకారమే హత్యాయత్నం చేసాడు నిందితుడు. 92 మంది సాక్షులను విచారించి, స్టేట్మెంట్స్ రికార్డు చేసాం అని తెలిపారు. దాడికి ఉపయోగించిన కత్తిని శ్రీనివాస్ రెండుసార్లు పదును పెట్టినట్టు వెల్లడించారు కమిషనర్ మహేష్ లడ్డా. కోడి కత్తి సానపెట్టినప్పుడు తన సహచరులు కూడా చూసారని తెలిపారు.
దాడి జరిగిన రోజు ఉదయం 4:45 నిమిషాలకే శ్రీనివాస్ ఇంటి నుండి బయలుదేరినట్టు చెప్పారు. ఈరోజు నన్ను టీవిలో చూస్తారంటూ ఒక మహిళతో శ్రీనివాస్ చెప్పాడంటూ వెల్లడించారు. ఉదయం 9 గంటలకు రెస్టారెంట్ లో కూడా కోడి కత్తిని సానబెట్టాడు. హేమలత, శ్రీనివాస్ ఇద్దరూ లోపలికి వెళ్లారు. రెండుసార్లు కోడి కత్తిని వేడినీటిలో స్టెరిలైజ్ చేశారు. వైసీపీ నాయకుడు ధర్మశ్రీతో జగన్ మాట్లాడుతుండగా దాడికి యత్నించాడు. కేసును కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించాలని వైసీపీ కోరుతోంది. ఈనేపధ్యంలో జాతీయ భద్రత అంశాలు ఉంటేనే ఎన్ఐఏ దర్యాప్తు చేస్తుంది అని స్పష్టం చేశారు సీపీ. హైకోర్టు తాము చెప్పేదాకా ఛార్జ్ షీట్ దాఖలు చేయొద్దని చెప్పింది అని పేర్కొన్నారు సీపీ మహేష్ చంద్ర లడ్డా.
విజయనగరం జిల్లాపై జగన్ ఫోకస్: బరిలోకి మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే