YS Jagan: వైయస్ జగన్ నిర్ణయమే సరైనది.. విజయేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

YS Jagan: ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా అల్లు అర్జున్ వివాదం సంచలనంగా మారింది. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఇకపై తాను ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నన్ని రోజులు తెలంగాణలో ఎలాంటి సినిమాలకు బెనిఫిట్ షోలు కానీ అలాగే టికెట్ల రేట్లు పెంచడం కానీ జరగదని తెలిపారు. ఇక ఈ విషయంపై దర్శక నిర్మాతలు షాక్ అవ్వడమే కాకుండా ఇదే విషయం గురించి రేవంత్ రెడ్డితో మాట్లాడటానికి ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టు సమాచారం.

ఇకపోతే తాజాగా రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయాన్ని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఎగ్జిబిటర్స్ స్వాగతించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయేందర్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సినిమా టికెట్ల రేట్ల విషయంలో గత ఏపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఎంతో మెచ్చుకోదగ్గదని ఈయన తెలిపారు.

వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రతి ఒక్కరికి సినిమా టికెట్లు అందుబాటులో ఉండే విధంగా రేట్లను తగ్గించారు.థియేటర్స్, టిక్కెట్ రేట్ల విషయంలో జగన్‌ తీసుకున్న నిర్ణయం ముమ్మాటికి సరైందేనని తెలిపారు. జగన్ ఇలాంటి నిర్ణయం తీసుకున్న సమయంలో సినిమా సెలబ్రిటీలు పూర్తిగా వ్యతిరేకించారు. ఇక అప్పుడు వైయస్ జగన్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని ప్రస్తుతం రేవంత్ రెడ్డి కూడా తీసుకున్నారని అయితే రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని అందరూ స్వాగతిస్తున్నారని విజయేందర్ రెడ్డి తెలిపారు. బెనిఫిట్ షోలో సినిమా టికెట్ల రేట్ల విషయంలో రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం సరైనదేనని కొనియాడారు