ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో రాజకీయ పరిణామాలు పూర్తిగా మారిపోతున్నాయి! పైగా జగన్ ఇన్ ఛార్జ్ లను మార్చే కార్యక్రమం పెట్టుకున్నప్పటి నుంచీ ఈ లెక్కలు మరింతగా మారిపోతున్నాయి. ఈ సమయలో బెజవాడ లోక్ సభ స్థానంతోపాటు పెనమలూరు, మైలవరం అసెంబ్లీ నియోజకవర్గాల్లో సరికొత్త చర్చ తెరపైకి వచ్చింది. దీంతో ఒక్కసారిగా విజయవాడ రాజకీయాలు వేడెక్కాయి.
ఏపీ రాజకీయాల్లో సరి కొత్త ట్విస్టులు తెరపైకి వస్తున్నాయి. ఇందులో భాగంగా విజయవాడ టీడీపీ ఎంపీ వైసీపీలోకి ఎంట్రీ ఖాయమైందని తెలుస్తుంది. దీంతో… విజయవాడ లోక్ సభ స్థానం నుంచి కేశినేని నానీ పోటీ చేయటం దాదాపు ఖరారైందని అంటున్నారు. ఇదే సమయంలో నాని కుమార్తె కేశినేని శ్వేత సైతం టీడీపీకి గుడ్ బై చెప్పారు. ఇప్పుడు ఈ ఇద్దరికీ జగన్ ఇచ్చిన హామీలపై చర్చ జరుగుతుంది.
ఈ విషయంలో ముందుగా విజయవాడ లోక్ సభ స్థానం నుంచి మరోసారి కేశినేని నానీ పోటీ కన్ ఫాం అని ఆయన కుమార్తె సైతం తాజాగా బహిరంగంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన ఇప్పుడు వైసీపీ నుంచి పోటీ అని అంటున్నారు. ఇదే సమయంలో కేశినేని చిన్ని అటు టీడీపీ నుంచి కానీ, ఇటు జనసేన నుంచి కానీ బెజవాడ లోక్ సభకు పోటీ కన్ ఫాం అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
దీంతో విజయవాడ లోక్ సభ స్థానంలో అన్నా తమ్ముళ్ల మధ్య రసవత్తర పోరు కన్ ఫాం అని అంటున్నారు పరిశీలకులు. అయితే… కేశినేని నానీ ఇప్పటికే పాతుకు పోయారనే కామెంట్లు వినిపిస్తుండగా.. కరోనా తర్వాత కేసినేని చిన్ని కూడా జనాల్లో బాగానే తిరిగారని చెబుతున్నారు. ఇక్కడ ప్రధానంగా ప్రజల్లో ఉన్న క్రెడిబిలిటీ అనేది కీ రోల్ పోషించే అవకాశం ఉందని అంటున్నారు.
ఇక కేశినేని నాని కుమార్తె శ్వేత కు కూడా అసెంబ్లీ టిక్కెట్ విషయంలో వైసీపీ నుంచి హామీ దక్కిందనే వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి శ్వేతను మైలవరం నుంచి అసెంబ్లీకి బరిలోకి దింపాలనేది కేశినేని నాని ఆలోచనగా చెబుతుంటారు. అయితే అక్కడ దేవినేని ఉమ రూపంలో టీడీపీలో బాబుకు సన్నిహితమైన నేత ఉన్నారు.
ఇదే సమయంలో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే పోటీ చేయకపోయినా, జగన్ ఇన్ ఛార్జ్ ని మార్చినా కూడా తమకు ఛాన్స్ ఉంటుందని నానీ భావించారని అంటారు. అయితే ఇటీవల మైలవరం సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్… తాను ఈసారి వైసీపీ నుంచి బరిలో ఉంటున్నట్లు కన్ ఫాం చేసిన సంగతి తెలిసిందే.
ఇదే సమయంలో కేశినేని నానీకి తనకు మాంచి సాన్నిహిత్యం ఉందని అన్నారు. వీరిద్దరూ కలిసి ఈసారి విజయవాడలో ఫ్యాన్ కి 5లో పెట్టి తిప్పాలని భావిస్తున్నట్లు తెలిసిందే. దీంతో మైలవరంలో దేవినేని ఉమకి ఇది బ్యాడ్ న్యూస్ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేశినేని నాని చూపు పెనమలూరుపై పడిందని అంటున్నారు!
గతకొన్ని రోజులుగా పెనమలూరు సిట్టింగ్ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధికి ఈదఫా విసీపీ టిక్కేట్ ఇవ్వడం లేదని.. గెలిచిన తర్వాత ఇచ్చే హామీలు వేరేగా ఉన్నాయని.. సర్వేలు, సమీకరణలే ఇందుకు కారణాలని కథనాలొస్తున్నాయి. దీంతో… తన కుమార్తెకు పెనమూలూరు అయితే మరింత సౌకర్యంగా ఉంటుందని నానీ భావించారని.. అందుకు వైసీపీ నుంచి కంఫర్మేషన్ వచ్చిందని అంటున్నారు.
దీంతో కృష్ణాజిల్లా రాజకీయాల్లో సమీకరణలు పూర్తిగా మారిపోతున్నాయని అంటున్నారు. వాస్తవానికి ఈ దఫా విజయవాడ లోక్ సభ సీటు బీసీకి ఇచ్చే ఆలోచనలో జగన్ ఉన్నారనే కథనాలు వచ్చాయి. ఆయన ప్రస్తుతం టీటీడీ బోర్డ్ మెంబర్ గా కూడా ఉన్నారని అన్నారు. అయితే… ఆయనను ఈదఫా గుంటూరు లోక్ సభ స్థానం నుంచి బరిలోకి దింపే అవకాశం ఉందని తెలుస్తుంది. ఏది ఏమైనా… ఈ దఫా ఏపీలో ఎన్నికలు నభూతో న భవిష్యతీ అన్నట్లుగా సాగుతాయనేది మాత్రం వాస్తవం!!