కట్టప్ప …చంద్రబాబు ఒకేటనట

బాహుబలి సినిమాలో కటప్పకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చంద్రబాబునాయుడు ఒకటేనా ? అవుననే అంటున్నారు వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి. ఈరోజు మీడియాతో మాట్లాడుతూ బాహుబలి సినిమాలో పక్కనే ఉంటూ బాహుబలిని కట్టప్ప వెన్నుపోటు పొడిచినట్లే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రత్యేకహోదా విషయంలో చంద్రబాబు వెన్నుపోటు పొడిచినట్లు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారంటూ మండిపడ్డారు. నాలుగేళ్ళ పాటు చంద్రబాబు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి రాష్ట్రానికి ఏమి సాధించారో చెప్పాలంటూ నిలదీశారు.

 

విజయసాయి అన్నాడని కాదుకానీ నిజానికి నాలుగేళ్ళ పాటు ఎన్డీఏలో కొనసాగిన చంద్రబాబు రాష్ట్రాభివృద్ధికి చేసింది శూన్యమనే చెప్పాలి. కేంద్రమే నిర్మించాల్సిన పోలవరం ప్రాజెక్టును ఒత్తిడి పెట్టి మరీ తన చేతుల్లోకి తీసుకున్నారు. దాంతో ప్రాజెక్టు నిర్మాణంలో భారీ ఎత్తున అవినీతి జరుగుతోంది. అదే విధంగా కేంద్రం నిధులతో అమలవుతున్న వివిధ పథకాల అమలులో కూడా అవినీతి జరుగుతోంది. ఈ విషయాలను ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు కావు. స్వయంగా కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నిర్ధారించిన విషయాలు.

 

అదే సమయంలో వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ సీట్లను పెంచుకోవటానికి చంద్రబాబు చాలా ప్రయత్నించారు. కానీ కేంద్రం అంగీకరించలేదు. నరేంద్రమోడి, హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఆర్దికశాఖ మంత్రి అరుణ్ జైట్లీలపై సీట్ల పెంపు విషయంలో ఎంత ఒత్తిడి పెట్టినా సీట్ల పెంపు సాధ్యం కాలేదు. అసెంబ్లీ సీట్లు పెరగవని ఎప్పుడైతే అర్ధమైపోయిందో వెంటనే చంద్రబాబు ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేశారు. అప్పటి నుండే మోడికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు.

 

అసెంబ్లీ సీట్లు పెంచకపోవటంతోనే తాను ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేసినట్లు చెప్పుకోలేరు కదా ? అందుకనే ప్రత్యేకహోదా ఇవ్వటం లేదని, రాష్ట్రప్రయోజనాలకు మోడి అడ్డం పడుతున్న కారణంగానే తాను ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేసినట్లు కతలు చెప్పటం మొదలుపెట్టారు. అందుకనే విజయసాయి తాజాగా చంద్రబాబును కట్టప్పతో పోల్చారు.