రైల్వే అధికారుల పై ఉప రాష్ట్రపతి వెంకయ్య సీరియస్ (వీడియో)

రైల్వే అధికారుల పై ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సీరియస్ అయ్యారు. కనీస ప్రొటోకాల్ పాటించలేదని అధికారుల పై వెంకయ్య నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి నుంచి నెల్లూరుకి రైలులో వెంకయ్య నాయుడు బయల్దేరారు. రేణిగుంట రైల్వే స్టేషన్ కు చేరుకున్న తర్వాత అక్కడ రైల్వే అధికారులు ప్రొటోకాల్ పాటించడం లేదని అధికారుల పై వెంకయ్య నాయుడు ఆగ్రహోదగ్రుడయ్యాడు. కనీసం కామన్ సెన్స్ లేదా మీకు అంటూ ఆయన అధికారుల పై రుసరుసలాడారు.

ఉపరాష్ట్రపతి వస్తున్నారంటే స్థానిక అధికారులు, రైల్వే అధికారులు ప్రొటో కాల్ ప్రకారం ఆయనకు స్వాగతం పలకాలి. బోకేలు, పూలు, శాలువాలతో ఆయనకు ఘన స్వాగత ఏర్పాట్లు చేయాలి. కానీ అటువంటి ఏర్పాట్లు ఏమీ కూడా అధికారులు చేయలేదు. దీంతో ఆయన సీరియస్ అయ్యారు. వెంకయ్య నాయుడు అధికారుల పై సీరియస్ అయిన వీడియో కింద ఉంది చూడండి.