కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీహెచ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రచార కమిటి పదవి దక్కపోవడం పై వీహెచ్ అసంతృప్తితో ఉన్నారు. కమిటి నుంచి తనను పక్కకు పెట్టడం కంటే తనను చంచల్ గూడ జైలులో పెడితే బాగుండేదని వ్యాఖ్యానించారు. తాను ప్రచార వాహనాన్ని కూడా సిద్దం చేసుకున్నానని, 1989 లో ప్రచార కమిటి చైర్మన్ గా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చానని వీహెచ్ అన్నారు.
తమ పార్టీలోనే కోవర్టులు ఉన్నారని ఆరోపించారు. కేసీఆర్ అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చారని కేసీఆర్ తో కొందరికి రహస్య ఒప్పందం ఉందన్నారు. తనకు పదవి ఇస్తే కేసీఆర్ ను ఓడిస్తాననే వాళ్ల భయం అని వీహెచ్ వ్యాఖ్యానించారు. వీహెచ్ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశమయ్యాయి. కేసీఆర్ కోవర్టుల వివరాలు త్వరలోనే బయటపెడుతానని వీహెచ్ అన్నారు.
కమిటీల కూర్పుపైన కాంగ్రెస్ నేతల్లో గాంధీ భవన్ వేదికగా అసంతృప్తి భగ్గుమంది. ప్రచార కమిటి చైర్మన్ పదవి దక్కలేదని వీహెచ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయనను పార్టీ స్ట్రాటజీ, ప్లానింగ్ కమిటీ చైర్మన్ గా నియమించారు. సీడబ్ల్యూసి సభ్యుడు గులాం నబీ ఆజార్ సమక్షంలోనే టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని వీహెచ్ ప్రశ్నించారు. వీహెచ్ తీరుతో కాంగ్రెస్ లో తిరుగుబావుటా తయారైందా అనే చర్చ జరుగుతోంది.