వాళ్లకి బిర్యానీ పెడితే వీరికి పప్పు అన్నమైనా పెట్టాలన్న వీహెచ్

కాంగ్రెస్ పార్టీలో బిసిలకు తక్కువ సీట్లు కేటాయించడం అన్యాయమని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ అన్నారు. జనాభాలో తక్కువ ఉన్న వారికి ఎక్కువ సీట్లు ఇచ్చి , జనాభాలో ఎక్కువ  ఉన్న వారికి తక్కువ సీట్లు ఇవ్వడం సరికాదన్నారు. రాహుల్ గాంధీ ఇందిర గాంధీ బాటలో నడవాలన్నారు.

అవుతలోడు బిర్యానీ తింటే ఇవతలివాడికి కనీసం పప్పుతోనైనా పెట్టాలని లేకపోతే ఏదో  ఓ రోజు బిర్యానీ మీద చేయి పెట్టడం ఖాయమని హెచ్చరించారు. కొంత మంది నేతల వల్ల బిసిలకు అన్యాయం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ అసలు విషయం తెలుసుకోవాలన్నారు.

సీట్ల కేటాయింపులో జరిగిన అవకతవకలవల్ల ముఖ్యమైన నేతలందరిని కాంగ్రెస్ పార్టీ కోల్పోయిందన్నారు. అందరి నేతలతో కాంగ్రెస్ పార్టీ చర్చలు జరుపుతుందని నేతలంతా పరిస్థితి అర్థం చేసుకోవాలని వీహెచ్ కోరారు.