“స్కాం”బాబు… ఉప్పల్ స్టేడియంలో బాబు ఇజ్జత్ పాయే!

వైసీపీ సానుభూతిపరులో, టీడీపీ వ్యతిరేకులో, గతంలో బాబుకు ఓటు వేసి దగాపడ్డ బాధితులో, స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ని నమ్మి దగాపడ్డ నిరుద్యోగులో తెలియదు కానీ… స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైనప్పటినుంచీ చంద్రబాబును వెంటాడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా బాబుపై ట్రోలింగ్స్ పీక్స్ కి తీసుకెళ్తున్నారు. ఇదే సమయంలో ఆ వెంటాడటం ఉప్పల్ స్టేడియం వరకూ తీసుకెళ్లారు.

అవును… ర్కికెట్ వరల్డ్ కప్ 2023 లో భాగంగా హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో పాకిస్తాన్ తన రెండో మ్యాచ్‌ లో శ్రీలంకతో తడబందింది. ఆమ్యాచ్ లో భారీ స్కోరు చేఇనప్పటికీ లంకకు చిత్తు తప్పలేదు. తొలుత బ్యాటింగ్ చేసిన లంక నిర్ణీయ 50 ఓవర్లలో 344 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ కి దిగిన పాకిస్థాన్ ఎవరూ ఊహించని రీతిలో ఛేజ్ చేసింది. శ్రీలంక బౌలర్లను ఊచకోత కోసింది.

ఇందులో భాగంగా నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి, ఇంకా పది బంతులు మిగిలిఉండగానే 345 పరుగులను సాధించి గ్రేట్ విక్టరీ నెలకొల్పింది. దీంతో ఈ నెల 14న ఇండియాతో జరగబోయే మ్యాచ్ కు తనదైన శైలిలో ఛాలెంజ్ చేసినంత పనిచేసింది. ఇలా ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ రసవత్తరంగా సాగుతున్నవేళ ఒక ఫ్లకార్డు కనిపించింది. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్.

ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతుండగా పాకిస్థాన్ రెండు వికెట్లు కోల్పోయి 72 పరుగుల వద్ద ఉన్న సమయంలో కెమెరా కంటికి ఒక ఫ్లకార్డ్ కనిపించింది. ఆ ఫ్లకార్డులో చంద్రబాబు ఫోటో తో పాటు కొన్ని ఇంగ్లిష్ అక్షరాలు కనిపించాయి. “ఐ యాం విత్ బాబు” అని రాసుందేమో అని కాస్త తేరిపారా చూసే సరికి… అసలు విషయంపై క్లారిటీ వచ్చింది. అందులో… “స్కాంస్టర్ బాబు” అని రాసుంది.

అవును… పాకిస్థాన్ – శ్రీలంక మ్యాచ్ రసవత్తరంగా కొనసాగుతున్నప్పుడు స్టాండ్స్‌ లో ఓ ఆసక్తికర ప్లకార్డ్ కనిపించింది. అది, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో అరెస్టయిన చంద్రబాబు నాయుడికి సంబంధించిన ప్లకార్డ్ కావడం గమనార్హం. ఆయనను స్కాంస్టర్ గా పేర్కొంటూ కొందరు ప్రేక్షకులు ఈ ప్లకార్డ్‌ ను ప్రదర్శించారు. దీనికి సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది.

ఆ ఫ్లాకార్డులో చంద్రబాబు ఫోటో పక్కన… “ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో 371 కోట్ల రూపాయలను చంద్రబాబు దొంగిలించారు” అనే అక్షరాలను ఇంగ్లీష్‌ లో ముద్రించారు. పక్కన చంద్రబాబు ఫొటోను ప్రింట్ చేశారు. ప్లకార్డ్ పైభాగంలో స్కాం స్టర్ బాబు అని, కింది భాగంలో “కరప్ట్ టీడీపీ” అని రాశారు. ఇది ఐసీసీ వరల్డ్ కప్ మ్యాచ్‌ కావడంతో అంతర్జాతీయంగా తెలుగువారి దృష్టిని ఆకర్షించినట్టయిందని అంటున్నారు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్!