మంత్రి పదవి పోయింది మడి చేను దిక్కయింది !

మంత్రి పదవి పోయింది మడి చేను దిక్కయింది !

ఈయన చాలా సీనియర్ రాజకీయ నాయకులు అనేక పర్యాయాలు మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. చివరాఖరుగా ఒక పార్టీలో పోటీ చేసి ఓడిపోతే అధికారంలోకి వచ్చిన పార్టీ ఆయన్ని తమ పార్టీలో చేర్చుకుని ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టి మంత్రిని చేసింది. ఈయనకి కొంచెం నోరు ఎక్కువని అధికారుల మీద తన నోటి దురుసును చూపుతారని అనేక వీడియోల ద్వారా బయటికి వచ్చింది.

అయితే కాలం ఎప్పుడూ ఒకలాగే ఉండదుగా. మొన్న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే తనకున్న సీనియారిటీని బట్టి ముఖ్యమంత్రి గారు ఈయన్ని తిరిగి కేబినెట్లోకి తీసుకుంటారని ఆశపడ్డారు. తప్పేమీ లేదు ఎందుకంటే పోయినసారి వేరే పార్టీ నుంచి తీసుకుని వచ్చి మంత్రి పదవి ఇచ్చారు. ఈసారి సొంత పార్టీలో మంత్రి పదవి ఇవ్వరా అని భావించారు.

అయితే కెసిఆర్ ఏమనుకున్నారో ఏమో ఇవ్వలేదు. ఇక చేసే పని ఏమీ లేదు కాబట్టి మడి చేలో స్వయంగా నిల్చుని వ్యవసాయం చూపిస్తూ ఇలా కెమెరాకి దొరికారు. ఆయన పేరే తుమ్మల నాగేశ్వరరావు.