ప్రస్తుతం చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఈ సమయంలో దాఖలు చేస్తున్న బెయిల్ పిటిషన్లు వరుసగా వాయిదాలు పడుతున్నాయి. ఇప్పటికే హైకోర్టు క్వాష్ పిటిషన్ ను కొట్టేసింది. మరోవైపు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో లోకేష్ ను ఏ14 గా చేర్చించి సీఐడీ. దీంతో ఈ రోజో రేపో ఆయన కూడా ములాకత్ లేకుండా బాబును కలిసే ఛాన్స్ ఉందని అంటున్నారు!
ఆ సంగతి అలా ఉంటే… రాజకీయాల్లో ఆరోపణలు చేసుకున్నట్లు, ట్రోల్ చేసుకున్నట్లుగా.. తమకు అనుకూలంగా తీర్పు రాకపోతే గౌరవనీయులైన న్యాయమూర్తులపై కూడా ట్రోల్స్ చేశారు కొంతమంది టీడీపీ నేతలు. అయితే ఈ విషయాన్ని న్యాయవాదులు సీరియస్ గా తీసుకున్నారు. ఇది విష సంస్కృతి అని పేర్కొన్నారు. ఇదే సమయంలో రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు.
దీంతో… ఈ విషయంపై రాష్ట్రపతి భవన్ స్పందించింది. ఈ మేరకు అలాంటిపనులు చేసినవారి గుర్తించి, చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎస్ ను కోరింది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన ఏపీ ప్రభుత్వం.. ఉద్దేశపూర్వకంగానే దూషణల పర్వం కొనసాగిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. దీంతో టీడీపీ నేత బుద్దా వెంకన్న, గోరంట్ల బుచ్చయ్య చౌదరీ సహా 26 మందికి నోటీసులు జారీ చేయాలని బుధవారం హైకోర్టు, ఏపీ డీజీపీని ఆదేశించింది.
అంతకముందు క్రిమినల్ కంటెంప్ట్ పిటిషన్ పై వాదనల సందర్భంగా.. “క్యాంపెయిన్ గా జడ్జిపై ట్రోలింగ్ చేశారు” ఐని ఏజీ శ్రీరామ్ తెలిపారు. ఇద్దరు హైకోర్టు జడ్జీలు, ఒక ఏసీబీ జడ్జి ఫ్యామిలీ మెంబర్స్ టార్గెట్ గా ట్రోలింగ్ నడిచిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వారందరికీ నోటీసులు ఇవ్వాలని ఆదేశించిన హైకోర్టు… తదుపరి చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రీని ఆదేశిస్తూ.. నాలుగు వారాలకు పిటిషన్ పై విచారణ వాయిదా వేసింది!
దీంతో బుద్ధా వెంకన్న, గోరంట్ల బుచ్చయ్య చౌదరీ, ఎస్. రామకృష్ణ, రామకృష్ణ గోనె, మువ్వా తారక్ కృష్ణ యాదవ్, రవికుమార్ ముదిరాజు, రుమాల రమేష్, ఎల్లా రావు, కళ్యాణి తోపాటు మరో 14 ప్రైవేటు వ్యక్తుల పేజీలతో పాటు గూగుల్ ఇండియా, ఫేస్ బుక్ ఇండియా, ట్విట్టర్ ఇండియా లకు నోటీసులు ఇవ్వనున్నారు!
కాగా.. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో చంద్రబాబును ఏపీ సీఐడీ అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరిచింది. కోర్టులో 10 గంటల వాదనల తర్వాత చంద్రబాబుకు రిమాండ్ విధించింది. ఆపై హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా.. దానిని హైకోర్టు కొట్టేసింది. దీంతో ఈ తీర్పులను ఇచ్చిన జడ్జీలను, వారి కుటుంబాలను సోషల్ మీడియా వేదికగా వికృత రూపాల్లో తూలనాడుతూ పోస్టులు దర్శనమిచ్చాయి.