అప్పుడు చంద్రబాబు ఏడుపు ఇప్పుడు జగన్ నవ్వు.. ట్రోలర్స్ ఇకనైనా మారరా?

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పలు సందర్భాల్లో ఏడుపుతో సింపతీ క్రియేట్ కావడానికి ప్రయత్నాలు క్రియేట్ చేశారు. చంద్రబాబు పలు సందర్భాల్లో వెక్కివెక్కి ఏడ్చగా అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రస్తుతం జగన్ నవ్వు గురించి కూడా సోషల్ మీడియాలో ట్రోల్స్ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో ట్రోలర్స్ ఇకనైనా మారాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

 

అప్పుడు చంద్రబాబు ఏడుపు ఇప్పుడు జగన్ నవ్వు గురించి ట్రోల్స్ వైరల్ అవుతుండగా సీఎంలలో ఎవరో ఒకరిని టార్గెట్ చేస్తే తప్ప ప్రశాంతత ఉండదా అని మరి కొందరు చెబుతుండటం హాట్ టాపిక్ అవుతోంది. సీఎంలను టార్గెట్ చేసిన పలువురు సోషల్ మీడియా యాక్టివిస్ట్ లు అరెస్ట్ అయిన సందర్భాలు సైతం ఉన్నాయనే సంగతి తెలిసిందే. జగన్, చంద్రబాబుపై ట్రోల్స్ వస్తున్నాయో లేక ఎవరైనా కావాలని చేయిస్తున్నారో స్పష్టత మాత్రం లేదు.

 

ఈ విషయాలకు సంబంధించి ట్రోలర్స్ ఇకనైనా మారాలని మరి కొందరు చెబుతున్నారు. ట్రోల్స్ కొంతమందికి నవ్వు తెప్పించినా ఎక్కువమందిని బాధ పెడుతున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు నాయుడు, జగన్ లకు ఉన్న అభిమానుల సంఖ్య తక్కువేం కాదు. ఈ మధ్య కాలంలో కొంతమంది ట్రోల్స్ శృతి మించుతూ అభిమానులకు కూడా ఇబ్బందులను కలగజేస్తున్నాయనే సంగతి తెలిసిందే.

 

పవన్ కళ్యాణ్ పై ఎవరైనా ట్రోల్స్ చేస్తే మాత్రం పవన్ అభిమానులు ధీటుగా బదులిస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ కు కోట్ల సంఖ్యలో ఫ్యాన్స్ ఉండగా పవన్ కళ్యాణ్ ను సీఎంగా చూడాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. రాజకీయ నేతలు ట్రోల్స్ ను సీరియస్ గా తీసుకుంటే మాత్రం ట్రోలింగ్ చేసేవాళ్లు ఇబ్బందులు పడక తప్పదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.