నేటి మార్కెట్ లో బంగారం, వెండి ధరలివే

పెళ్లిల సీజన్ కావడంతో బంగారం ధర పరుగెడుతోంది. మార్కెట్లో రోజు రోజుకు బంగారం ధర పెరుగుతుందే కానీ తగ్గడం లేదు. వివిధ మార్కెట్లలో మంగళవారం బంగారం వెండి ధరలు ఇలా ఉన్నాయి.

24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.34,620, విజయవాడలో రూ.34,200, విశాఖపట్నంలో రూ.34,750, ప్రొద్దుటూరులో రూ.34,000, చెన్నైలో రూ.33,580గా ఉంది.

ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.32,050, విజయవాడలో రూ.31,700, విశాఖపట్నంలో రూ.31,970, ప్రొద్దుటూరులో రూ.31,500, చెన్నైలో రూ.32,110గా ఉంది.

వెండి కిలో ధర హైదరాబాదులో రూ.41,400, విజయవాడలో రూ.41,700, విశాఖపట్నంలో రూ.41,500, ప్రొద్దుటూరులో రూ.41,500, చెన్నైలో రూ.43,600 వద్ద ముగిసింది.