Tirupathi: తిరుపతి తొక్కిసలాట ఘటన… చంద్రబాబు.. పవ,న్ లోకేష్, జగన్ స్పందన ఇదే?

Tirupathi: ఏడుకొండల పై పెద్ద ఎత్తున అపశృతి చోటుచేసుకుంది . జనవరి 10వ తేదీ వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార టోకెన్లను జారీ చేశారు అయితే ఈ టోకెన్లు తీసుకోవడం కోసం లక్షల్లో భక్తులు ఎదురుచూస్తూ ఉన్నారు. అయితే ఒక్కసారిగా గేట్లు ఓపెన్ చేయడంతో పెద్దదైన తొక్కిసలాట జరిగి సుమారు 6 మంది భక్తులు మృతి చెందగా పదుల సంఖ్యలో భక్తులు గాయాలు పాలయ్యారు. అయితే ఈ ఘటన ప్రస్తుతం ఏపీ రాష్ట్ర రాజకీయాలలో తీవ్ర దుమారం రేపుతుంది.

ఈ క్రమంలోనే తిరుపతి ఘటన జరిగిన తర్వాత కూటమి నాయకులు వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి సైతం ఈ ఘటనపై స్పందించారు. చంద్రబాబు నాయుడు స్పందిస్తూ తిరుమలలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేయడమే కాకుండా గాయపడిన వారికి సరైన చికిత్స అందించాలని ఎప్పటికప్పుడు అధికారులు సమాచారం అందజేయాలి అంటూ చంద్రబాబు స్పందించారు.

ఇక ఈ ఘటనపై లోకేష్ సైతం స్పందించారు. వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల విడుదల నేపథ్యంలో తిరుపతిలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన తొక్కిసలాటలో నలుగురు భక్తులు మృతి చెందడం నన్ను తీవ్ర మనోవేదనకు గురిచేసింది. ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండడం కోసం టీటీడీ మరింత భద్రత చర్యలు చేపట్టాలని, మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని లోకేష్ స్పందించారు.

ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం స్పందిస్తూ..తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు చనిపోవడం తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందని తెలిపారు. మృతులం కుటుంబాలకు అండగా నిలుస్తామని, తగిన సహాయసహకారాలను అందించాలని అధికారులను ఆదేశించారు. తిరుపతి టికెట్ కౌంటర్ల దగ్గర అధికారులు, పోలీసులకు సహకరించాలని పవన్ తెలిపారు.

ఇక వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి సైతం ఈ ఘటనపై స్పందించారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపం తెలియజేశారు. గాయపడ్డవారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం వచ్చిన భక్తులు ఇలా ప్రాణాలు కోల్పోవడం అత్యంత విచారకరమన్నారు. గాయపడిన వారు వెంటనే కోలుకోవాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అంటూ జగన్ స్పందించారు.