మదనపల్లి నిందితులకి భద్రత ఇవ్వలేమంటూ చేతులెత్తేసిన తిరుపతి పోలీసులు

Tirupati police have refused to provide security to the Madanapalle accused

మదనపల్లి ఇద్దరు కూతుళ్ల హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితులను 24 గంటల తరువాత అరెస్టు చేశారు పోలీసులు. కోర్టులో 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తే ఇప్పటివరకు రెండురోజుల పాటు జైలు శిక్షను అనుభవించారు. సెక్షన్ 302 కేసు కింద పోలీసులు హత్య కేసును నమోదు చేశారు. ఇందులో ప్రధాన ముద్దాయిలు తల్లిదండ్రులు పురుషోత్తంనాయుడు, పద్మజ వీరిద్దరి మానసిక పరిస్థితి బాగాలేదని మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు తేల్చిచెప్పారు.

Tirupati police have refused to provide security to the Madanapalle accused
Tirupati police have refused to provide security to the Madanapalle accused

స్వయంగా సైకాలజిస్ట్ వైద్యులు దీన్ని నిర్థారించి వారు సాధారణ స్థితికి రావాలంటే ట్రీట్మెంట్ అవసరమని తిరుపతి రుయా ఆసుపత్రికి రిఫర్ చేశారు. తిరుపతిలోని రుయా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక సైకియాట్రి విభాగంలో వీరికి చికిత్స చేయనున్నారు. వీరు డెల్యూషన్ అనే వ్యాధితో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో నిన్న జైలు సూపరింటెండెంట్ రామక్రిష్ణ నాయక్ మెజిస్ట్రేట్ దగ్గరకు పర్మిషన్ కోసం వెళ్ళారు. అయితే వీరిని భద్రత నడుమ తిరుపతికి తరలించాలని మెజిస్ట్రేట్ ఆదేశించారు. దీంతో ఈరోజు మళ్ళీ మెజిస్ట్రేట్ దగ్గరకు వెళితే ఆయన అనుమతిచ్చారు.

కానీ పోలీసులు మాత్రం భద్రత కల్పించడానికి ముందుకు రాలేదు. ముఖ్యంగా పోలీసు సిబ్బంది వీరికి భద్రత కల్పించలేమని.. వారి మానసిక స్థితి అస్సలు బాగాలేదని.. ఈ విధులను నిర్వర్తించలేమని తేల్చి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారట. అంతేకాదు అసలు వీరిద్దరికి భద్రత కల్పించేందుకు ఇంకెవరు ముందుకు కూడా రావడం లేదట. దీంతో మదనపల్లె సబ్ జైలు నుంచి నిందితులిద్దరిని తిరుపతి రుయాకు తీసుకురావడం కష్టసాధ్యంగా మారుతోంది.