హాట్ టాపిక్: బాబుకు వరుసగా మూడు బ్యాడ్ న్యూస్ లు!

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. వచ్చే నెల 1వ తేదీ వరకూ బాబు జ్యుడీషియల్ రిమాండ్ తాజాగా పొడిగింపబడిన సంగతి తెలిసిందే. దీంతో… నారా లోకేష్, భువనేశ్వరులు పార్టీ కార్యక్రమాలను పంచుకుని, ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు!

ఈ నేపథ్యంలో ఈ రోజు చంద్రబాబుకు వరుసగా మూడు బ్యాడ్ న్యూస్ లు వినిపించాయిల్. అందులో ప్రస్తుతానికి ఒకటి విజయవాడ ఏసీబీ కోర్టులో కాగా… మిగిలిన రెండూ సుప్రీంకోర్టులో కావడం గమనార్హం. ఇందులో భాగంగా… ఏపీ ఫైబర్‌ నెట్‌ స్కాం కేసులో ముందస్తు బెయిల్‌ కోరుతూ టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలుచేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.

జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌, జస్టిస్‌ బేలా ఎం.త్రివేది ధర్మాసనం ఎదుట చంద్రబాబు తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా తమ వాదనలు వినిపించారు. అనంతరం తదుపరి విచారణను సుప్రీంకోర్టు నవంబర్‌ 8కి వాయిదా వేసింది. ఇదే సమయంలో… స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం కేసుపై తీర్పు తర్వాత ఫైబర్‌ నెట్‌ కేసు అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటామని తెలిపింది. అప్పటి వరకు ఈ కేసులో చంద్రబాబుని అరెస్ట్ చేయొద్దని ఆదేశించింది.

ఇదే సమయంలో స్కిల్ స్కాం కేసులో క్వాష్ పిటిషన్ పై తీర్పును నవంబర్ 8న వెల్లడిస్తామని స్పష్టం చేసింది. రేపటి నుంచి ఈనెల 29 వరకు కోర్టుకు దసరా సెలవులు. అయితే ఇప్పటికే క్వాష్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్ చేయటంతో ఈ రోజు తీర్పు వెలువరిస్తారనే అంచనాలు ఉన్నాయి. కానీ, ఈ తీర్పుకు సంబంధించి తాజాగా అత్యున్నత న్యాయస్థానం స్పష్టత ఇచ్చింది. నవంబర్ 9కి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.

మరోపక్క విజయవాడ ఏసీబీ కోర్టులో నేడు చంద్రబాబు మూడు పిటిషన్లపై విచారణ జరగనుంది. ఇందులో భాగంగా… ఫైబర్ నెట్ స్కామ్‌ కేసులో పీటీ వారెంట్‌ పై విచారణ, కాల్ డేటా రికార్డింగ్ పిటిషన్‌ తో పాటు లీగల్ ములాఖాత్ల సంఖ్య మూడుకి పెంచాలని వేసిన పిటిషన్ లపై ఈ రోజు విచారణ జరగనుంది.

ఈ క్రమంలో తాజాగా చంద్రబాబు లీగల్‌ ములాఖత్‌ పిటిషన్‌ ను ఏసీబీ కోర్టు తిరస్కరించింది. లీగల్‌ ములాఖత్‌ లను మూడుకు పెంచాలని గురువారం చంద్రబాబు తరుపు లాయర్లు పిటిషన్‌ వేశారు. అయితే ప్రతివాదుల్ని చేర్చకపోవడంతో విచారణ అవసరం లేదంటూ ఇవాళ పిటిషన్‌ ను కోర్టు తిరస్కరించింది! ఇలా ఈ రోజు ఇప్పటివరకూ చంద్రబాబుకు సంబంధించిన మూడు పిటిషన్లు చేదు నిజాన్నే చెప్పాయి!