పవన్ ను సీఎం చేస్తే జనసేన నేతలకు ఓకే.. కానీ ట్విస్ట్ ఏంటంటే?

ఏపీకి పవన్ కళ్యాణ్ సీఎం కావాలనేది ఏపీ ప్రజలలో కొంతమంది ఆకాంక్ష అనే సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ అభిమానులు పవన్ ను సీఎంగా చూస్తే తమ కల నెరవేరుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పవన్ ను సీఎం అభ్యర్థిగ ప్రకటించి టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని జనసేన నేతలు, పవన్ అభిమానులు భావిస్తున్నారు.

అయితే పవన్ కు ఎలాంటి రాజకీయ అనుభవం లేకపోవడం మైనస్ అవుతోంది. పవన్ సీఎం అయినా ప్రజలకు మేలు జరిగేలా పాలించడం సాధ్యం కాదని కొంతమంది నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎలాంటి పదవి చేపట్టని పవన్ ను సీఎం చేస్తే టీడీపీ నేతల నుంచి విమర్శలు వచ్చే ఛాన్స్ ఉండటంతో పాటు వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశాలు అయితే ఉంటాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

వచ్చే ఎన్నికల్లో పవన్ పోటీ చేస్తారా? లేదా? అనే ప్రశ్నలకు సైతం సరైన సమాధానం దొరకడం లేదు. పవన్ కళ్యాణ్ మనసులో పొలిటికల్ కెరీర్ కు సంబంధించి ఏముందనే ప్రశ్నకు సమాధానం దొరకాల్సి ఉంది. సినీ కెరీర్ పీక్స్ లో ఉన్న పూర్తిస్థాయిలో రాజకీయాలకే పరిమితం అవుతారా అనే ప్రశ్నకు సమాధానంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పవన్ కళ్యాణ్ కు సైతం ప్రజల కోసం ఏం చేయాలనే క్లారిటీ మిస్సైందని కామెంట్లు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ త్వరలో కొత్త ప్రాజెక్ట్ లను సైతం ప్రకటించనున్నారు. సినిమాలపై పవన్ కు ఉన్న శ్రద్ధ రాజకీయాలపై లేదని కొంతమంది విమర్శలు చేస్తున్నారు. ఈ విమర్శల గురించి పవన్ కళ్యాణ్ ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.