బిగ్ బ్రేకింగ్: రేవంత్ పై ఐటి దాడులు, స్కెచ్ ఇదే

రేవంత్ రెడ్డి ఇంటిపై ఇంటిపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులు జరుగుతున్న నేపథ్యంలో కొన్ని కీలక విషయాలు బయటకు వచ్చాయి. ఈ దాడులకు ముందే ప్లాన్ రెడీ అయినట్టుగా తెలుస్తోంది. ఆ వివరాలు కింద ఉన్నాయి చదవండి.

ఢిల్లీ నుంచి వారం రోజుల క్రితమే ఇన్‌క‌మ్‌ట్యాక్స్‌ (ఐటి) ప్రతినిధి బృందం హైదరాబాద్ వచ్చింది. అప్పుడే వచ్చి డీజీపీకి రిపోర్ట్ చేసింది. రేవంత్ రెడ్డి ఆస్తులపైన ఐటి దాడులు చేయబోతున్నట్టు స్టేట్ డీజీపీకి సమాచారం ఇచ్చింది. ఏ క్షణంలోనైనా రేవంత్ ఇంటిపై దాడులు జరుగుతాయన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరిగింది. ఈ నేపథ్యంలో రేవంత్ ఆస్తులు, కుటుంబ సభ్యుల ఆస్తులు, బంధువుల ఆస్తుల వివరాలు సేకరించింది ఐటి బృందం.

అయితే కుటుంబ సభ్యులతో కలిసి నిన్న తిరుపతి దర్శనానికి వెళ్లారు రేవంత్. అక్కడి నుండి డైరెక్ట్ గా కొడంగల్ వెళ్లారు. ఈరోజు కొడంగల్ లో ప్రచారం చేయనున్నారు రేవంత్. ఈ నేపథ్యంలోనే హైదరాబాదులో జూబ్లీ హిల్స్ లోని రేవంత్ ఇంటిపై 15 మంది ఐటి అధికారుల బృందం దాడులు జరుపుతున్నది. ప్రస్తుతం హైదరాబాద్ రేవంత్ నివాసంలో కుటుంబ సభ్యులు ఎవరూ లేరు. అందరూ కొడంగల్ లో ఉన్నారు. కొడంగల్ లో కూడా ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఇది బీజేపీ, టీఆరెస్ కుట్రగా ఆరోపిస్తున్నారు రేవంత్ అనుచరులు. జగ్గారెడ్డిని జైలుకి పంపిన నేపథ్యంలో రేవంత్ పైన కూడా ఇలాంటి కుట్ర జరుగుతుందని ముందే ఊహించాము అంటున్నారు. రాజకీయంగా ఎదుర్కొనలేకనే అధికార పార్టీ కుట్రలు పన్నుతోందని రేవంత్ వర్గాలు ఆగ్రహిస్తున్నాయి.

2015 లో  ఎమ్మెల్సీ ఎలక్షన్ లో  ఎమ్మెల్యే ఓట్ల కొనుగోలుకు టిడిపి ప్రయత్నింంచిందని ఆరోపణ ఉంది. అపుడు నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సెన్‌ టిడిపి అభ్యర్థికి ఓటేస్తే కోటి రుపాయాలు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది.

 

 ఈ డబ్బు సమకూర్చింది  అప్పటి టిడిపి ఎమ్మెల్యే  రేవంత్ రెడ్డే.   ఈ డబ్బు అందచేసేందుకు ప్రయత్నం జరగుతున్నందని  పక్కా సమాచారం అందుకున్నఏసీబీ అధికారులు రంగంలోకి దిగి రెడ్ హాండెడ్ గా డబ్బు ఇవ్వ చూపిన రేవంత్ ని పట్లుకుంది.  అపుడు  కేవలం రూ.50లక్షలు మాత్రమే దొరికాయి. . అయితే మిగిలిన మొత్తం ఏమయిందో  ఎసిబి కనిపెట్టలేకపోయింది. ఈ కేసు నోట్ ఫర్ వోట్ గా పేరొందింది.  కొద్దిరోజుల క్రితం ఈ డబ్బు వ్యవహారం కనుగొనేందుకు  ఎసిబి  ఈడికి ఈ వ్యవహారాన్ని బదిలీ చేసింది.  ఇందులో భాగంగానే ఈ రోజు ఈడీ అధికారులు రేవంత్‌రెడ్డి ఇళ్లతో పాటు కార్యాలయాలపై దాడులు జరిపారు. 

 ఆ మధ్య జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో జరిగిన  అక్రమాల విషయంలో జూబ్లీహిల్స్ పోలీసులు రేవంత్‌రెడ్డికి నోటీసులు జారీ చేశారు.

వీటినేపథ్యంలో  తనపై దాడులు జరుగుతాయంటూ రేవంత్‌రెడ్డి చెబుతూనే వస్తున్నారు.  ఈ  ఆరోపణలు నిజం చేస్తూ ఈ దాడులని చెబుతున్నారు.