చంద్రబాబు పవన్ కళ్యాణ్ పొత్తు కష్టమే.. ఇద్దరికీ ఆశ ఎక్కువే కదా?

pawan-kalyan-chandrababu-naidu-meeting-1505959

టీడీపీ జనసేన పొత్తు కచ్చితంగా ఉంటుందని ఏపీలోని రాజకీయ నేతలు అందరూ భావించారు. ఎందుకంటే ఈ రెండు పార్టీల పొత్తు వల్ల వైసీపీ వ్యతిరేకత ఓటు చీలకుండా ఉంటుంది. ఏపీలోని ఇతర రాజకీయ పార్టీలు రాష్ట్రంలో పెద్దగా ప్రభావం చూపకపోవడంతో టీడీపీ జనసేన పొత్తు కోసం ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పవన్ కు సైతం పొత్తు మినహా మరో ఆప్షన్ లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.

అయితే చంద్రబాబు పవన్ కళ్యాణ్ పొత్తు తేలిక కాదని సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. అటు చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్ కు ఆశ ఎక్కువే కావడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. సీఎం సీటును పవన్ ఆశిస్తుండగా ఆ పదవిని త్యాగం చేసే ఆలోచన తనకు అస్సలు లేదని చంద్రబాబు భావిస్తున్నట్టు తెలుస్తోంది. వయస్సు పెరుగుతున్న నేపథ్యంలో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇప్పుడు ఛాన్స్ మిస్ అయితే 2029 సమయానికి టీడీపీకి భవిష్యత్తు ఉండదని చంద్రబాబు భావన అని తెలుస్తోంది. వైసీపీకి వ్యతిరేకత తనకు ప్లస్ అవుతుందని ఆయన భావిస్తున్నట్టు బోగట్టా. పలు సర్వేలలో అనుకూల ఫలితాలు వస్తుండటంతో చంద్రబాబుకు 2024 ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఒకింత కాన్ఫిడెన్స్ పెరుగుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

పవన్ సైతం తనకు క్రేజ్ ఎక్కువని టీడీపీతో పొత్తు పెట్టుకోకపోతే ఆ పార్టీ ఓట్లే చీలుతాయని భావన ఉన్నట్టు తెలుస్తోంది. పవన్, చంద్రబాబు పొత్తు పెట్టుకోకపోతే వైసీపీ బొటాబొటీ మెజారిటీతో అధికారంలోకి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇతర రాష్ట్రాల ప్రజలు సైతం ఏపీలో అమలవుతున్న స్కీమ్స్ విషయంలో పాజిటివ్ గా ఉన్నారు.