నారా కుటుంబం తరపున ప్రచారమే నందమూరి హీరోలకు శాపమవుతుందా?

ప్రతి మనిషి జీవితంలో కొన్ని ఘటనలు యాదృచ్ఛికంగా జరుగుతుంటాయి. ఆ ఘటనలు మనుషులను ఆశ్చర్యానికి గురి చేయడంతో పాటు కొన్ని కొత్త విషయాలను కూడా నమ్మేలా చేస్తాయి. నందమూరి ఫ్యామిలీ హీరోలు నారా కుటుంబం తరపున ప్రచారం చేయడానికి వెళ్లిన సమయంలో నందమూరి హీరోలు ప్రమాదాలకు గురవుతూ ఉండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.

2009 సంవత్సరం సమయంలో చంద్రబాబు కోరిక మేరకు తారక్ టీడీపీ తరపున ప్రచారం చేశారు. అంతకు ముందు ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తన కెరీర్ లో యాక్సిడెంట్ కు గురైన సందర్భాలు దాదాపుగా లేవు. అయితే తారక్ కు యాక్సిడెంట్ అయిందనే ఘటన ఫ్యాన్స్ ను ఒకింత షాక్ కు గురి చేసిందనే సంగతి తెలిసిందే. ఆ తర్వాత తారక్ అనారోగ్యం నుంచి కోలుకోవడంతో పాటు టీడీపీకి దూరమయ్యారు.

మరోవైపు ఇంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్న తారకరత్న గత కొంతకాలం నుంచి రాజకీయాలపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాటు గుడివాడ నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ఎవరూ ఊహించని విధంగా ఆయనకు గుండెపోటు వచ్చింది. లోకేశ్ పాదయాత్ర రోజున జరిగిన ఈ ఘటన టీడీపీ వర్గాలను ఒకింత షాక్ కు గురి చేసిన సంగతి తెలిసిందే.

సీనియర్ ఎన్టీఆర్ ఆత్మకు నందమూరి హీరోలు టీడీపీ తరపున ప్రచారం చేయడం ఇష్టం లేదని అందుకే ఈ విధంగా జరిగిందని కామెంట్లు వినిపిస్తున్నాయి. బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్నా నందమూరి ఫ్యామిలీ హీరో అయినా టీడీపీ తరపున ప్రచారంలో పాల్గొన్న సందర్భాలు ఎక్కువగా లేవు. తన నియోజకవర్గం పనులు మాత్రమే ఆయన చూసుకుంటారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.