పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాను ఎక్కడ మాట్లాడినా ఆ మాటలలో ఎక్కువగా నీతులు ఉంటాయి. అయితే నీతులు ఎక్కువగా చెప్పే పవన్ ఆ నీతులను పాటిస్తారా అనే ప్రశ్నకు కాదనే సమాధానం వినిపిస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల వల్లే ఎక్కువగా నష్టపోతున్నారని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వైరల్ అవుతున్నాయి. విశాఖలో వైసీపీ నేతలపై జనసేన నేతలు, కార్యకర్తల దాడులను ఎవరూ హర్షించరు.
అభిమానులు, కార్యకర్తలు ఏం చేసినా పవన్ సమర్థిస్తే భవిష్యత్తులో ఇబ్బందులను ఎదుర్కోక తప్పదు. పవన్ పై అభిమానులకు ఎంత అభిమానమైనా ఉండొచ్చు కానీ ఆ అభిమానం హద్దులు దాటితే మొదట నష్టపోయే వ్యక్తి కూడా పవన్ అనే సంగతి తెలిసిందే. కొంతమంది ఎమ్మెల్యేలు తాము కార్యకర్త నుంచి ఎమ్మెల్యేగా గెలిచామని పవన్ ఏ ఎన్నికల్లో గెలిచాడని కామెంట్లు చేస్తున్నారు.
పవన్ తన పొలిటికల్ కెరీర్ లో ఎంతో విలువైన సమయాన్ని వృథా చేస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. పవన్ ఇవే తప్పులను రిపీట్ చేస్తే మాత్రం నష్టపోయే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పవన్ రాజకీయాల్లో సక్సెస్ కావాలంటే కొన్ని విషయాల్లో మారక తప్పదు. అదే సమయంలో ఇతర నేతలను కూడా ఫాలో అయితే మంచిదని చెప్పవచ్చు.
ఎంతో క్రేజ్ ఉన్న పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించకపోవడం అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. మరోవైపు పవన్ విషయంలో జగన్ సర్కార్ వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు తావిస్తోంది. విశాఖలోని నోవాటెల్ హోటల్ దగ్గర జనసేన నేతలు సైతం పవన్ ను కలవకుండా పోలీసులు అడుగులు వేస్తున్నారు. ఇతర పార్టీల నేతల విషయంలో జగన్ ఇంత కఠినంగా వ్యవహరించడం కరెక్ట్ కాదని కామెంట్లు వినిపిస్తున్నాయి.