సినిమా డైలాగ్స్ రియల్ లైఫ్ లో పనికిరావు బాలయ్య.. ఎప్పుడు అర్థమవుతుందో?

అటు రాజకీయాలలో ఇటు సినిమాలలో సీనియర్ ఎన్టీఆర్ సంచలనాలు సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఎన్టీఆర్ ఎంత ఎదిగినా హద్దులు దాటి ఏనాడు విమర్శలు చేయలేదు. సీనియర్ ఎన్టీఆర్ కామెంట్ల గురించి సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ ఎప్పుడూ జరగలేదు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు విషయంలో బాలయ్య స్పందించిన తీరుపై ఊహించని స్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయనే సంగతి తెలిసిందే.

తండ్రి గురించి బాలయ్య స్పందించడంలో తప్పు లేదని అయితే తండ్రి పేరును తీసేస్తే మొత్తం తెలుగు జాతికి అవమానం జరిగిందనే విధంగా బాలయ్య కామెంట్లు చేయడం ఏంటని కామెంట్లు వినిపిస్తున్నాయి. సినిమాలలో బాలయ్య అద్భుతంగా డైలాగ్స్ చెబితే విజిల్స్ వేస్తారు. అంత మాత్రాన బాలయ్య రియల్ లైఫ్ లో కూడా అదే విధంగా డైలాగ్స్ చెబితే మాత్రం విమర్శల పాలు కావాల్సి ఉంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

సీనియర్ ఎన్టీఆర్ కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచిన సమయంలో బాలయ్య ఏం చేశారని మరి కొందరు కామెంట్లు చేస్తుండటం గమనార్హం. బాలయ్య హద్దులు దాటి చేస్తున్న విమర్శలు టీడీపీకి సైతం మైనస్ అవుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు గురించి స్పందించినా వైసీపీ నేతలలో ఎవరూ విమర్శలు చేయలేదనే సంగతి తెలిసిందే. మరి బాలయ్యపై మాత్రం ఎందుకు విమర్శలు వస్తున్నాయో ఆయన ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది.

తన తండ్రి గురించి గొప్పగా చెప్పుకునే క్రమంలో బాలయ్య చేసే కామెంట్లు తండ్రిపై ప్రజలలో మరింత నెగిటివ్ ఒపీనియన్ ను కలిగించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. చంద్రబాబు, లోకేశ్ చెప్పిన విధంగా ముందుకెళుతున్న బాలకృష్ణ సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్లే విమర్శల పాలు అవుతున్నారని నెటిజన్లలో చాలామంది అభిప్రాయాలను వ్యక్తం చేయడం గమనార్హం.