తెలంగాణలో మూడో విడత ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. బుధవారం తెలంగాణలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 30 న ఉదయం 7 గంటల నుంచి మద్యాహ్నం 1 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు మద్యాహ్నం 2 గంటల నుండి కౌటింగ్ ప్రారంభమవుతుంది.
మూడో దశలో 4116 గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండేను. కానీ 10 గ్రామపంచాయతీలకు నామినేషన్లే దాఖలు కాలేదు. 573 గ్రామపంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 3529 గ్రామ పంచాయతీ లకు ఎన్నికలు జరగనున్నాయి. బరిలో 11, 667 సర్పంచ్ అభ్యర్థులున్నారు. 27583 వార్డులకు ఎన్నికలు జరగున్నాయి. 8956 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 185 వార్డులకు నామినేషన్ దాఖలు కాలేదు. 27583 వార్డుల్లో బరిలో 67316 ఉన్న అభ్యర్థులున్నారు. సోమవారం సాయంత్రం నుంచి ఫలితాలు వెలువడే వరకు ఎన్నికలు జరగనున్న గ్రామాల్లో మద్యం దుకాణాలు మూసివేయనున్నారు.