హిందుపురం ఎమ్మెల్యే , నటసింహ బాలకృష్ణ కోపిస్ట్ అయినా..మనసు వెన్న అన్నది అందరికీ తెలిసిన వాస్తవమే. ఆవేశంలో నోరు జారినా సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకోవడంలో బాలయ్యకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఒకటుంది. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో బాలకృష్ణ చూపించే చొరవ చాలా ప్రత్యేకమైనిదే. కోపం కట్టలు తెచ్చుకుని ఎంత వేగంగా ఉబికి వచ్చేస్తుందో! ఎవరికైనా సహాయం చేయాలంటే బాలయ్య అంతే వేగంగా స్పందిస్తారు. బాలయ్య లోపల ఉన్న గొప్ప గుణమది. బాలయ్య మంచి మనసు గురించి తెలిసిన ఇండస్ర్టీ పెద్దలు సైతం చెప్పే మాట ఇది. ఇలాంటి విషయాల్లో బాలయ్య చాలా మందికి ఆదర్శంగా, స్ఫూర్తిగా నిలుస్తుంటారని వక్తలు ఎప్పటికప్పుడు వేదికలపై ఉద్ఘాటిస్తూనే ఉంటారు.
ఇక ఆపత్కాలమైన కరోనా సమయంలో బాలకృష్ణ ఎంత సహాయం చేసారో! చెప్పాల్సిన పనిలేదు. రెండు రాష్ర్టాల ప్రభుత్వాలకు 50 లక్షలు చొప్పున మొత్తం కోటి విరాళం అందించారు. చిరంజీవి ఏర్పాటు చేసిన సీసీసీ చారిటీకి మరో 25 లక్షలు విరాళం ఇచ్చారు. ఇంకా సీని కార్మికులకు వ్యక్తిగతంగా దర్శకుడు వి.వి. వినాయక్ ద్వారా మందులు పంపిణీ చేసారు. బసవతారకం క్యాన్సర్ సిబ్బందికి, రోగులకు కరోనా మందులు అందించారు. ఇటీవలే సొంత నియోజక వర్గమైన హిందుపురం కు 55 లక్షల రూపాయల మందులు..అక్కడ పనిచేస్తోన్న డాక్టర్లు, ఇతర సిబ్బందికి కరోనా కిట్లు అందించారు. ఇది బాలయ్య అంటే.
ప్రజా ప్రతినిధి హోదాలో ఇంత సహాయం చేసిన టీడీపీ నేతలు ఎవరైనా ఉన్నారా? అధికార పక్షం మంత్రులు గానీ, ఎమ్మెల్యేలు గానీ ఎవరైనా ఉన్నారా? అంటే సరైన సమాధానం దొరకదు. ఇక చంద్రబాబు నాయుడు ఏపీ ప్రభుత్వానికి కేవలం 10 లక్షలు మాత్రమే విరాళం ఇచ్చారు. మరి బాలకృష్ణ ను చూసి నోర్చుకోవాల్సింది ఏంటో? ఇప్పటికైనా అర్ధమయ్యే ఉంటుంది. విమర్శలు చేసే ముందు..ఆరోపణలు గుప్పించే ముందు ప్రజలకు మనమేం చేసాం! అన్నది ఓసారి ఆత్మపరిశీలన చేసుకుంటే! సహాయం అనే మాట నోట వచ్చే అవకాశం ఉంటుందేమో.