కోదందరాం పార్టీకి కాంగ్రెస్ ఇచ్చిన సీట్లు ఇవేనా ?

తెలంగాణ జన సమితి పార్టీకి 8 సీట్లు కేటాయించినట్లు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్చార్జి రామచంద్ర కుంతియా ఢిల్లీలో ప్రకటించారు. తెలంగాణ జన సమితి కనీసం 12 కు తగ్గకుండా సీట్లు ఇవ్వాలని పట్టుపట్టినా తుదకు 8 సీట్లకు ఆ పార్టీని పరిమితం చేసింది కాంగ్రెస్ పార్టీ.

విశ్వసనీయ సమాచారం మేరకు తెలంగాణ జన సమితికి ఇచ్చిన సీట్లలో ఆరు సీట్లకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మరో రెండు సీట్లపై ఇంకా ఎటూ తేలలేదని తెలిసింది. 

సామాజికవర్గాల వారీగా జన సమితి తీసుకున్న సీట్లలో రెడ్డి కమ్యూనిటీకి ఖరారైన 6లో నాలుగు రెడ్డి, ఒక బ్రాహ్మణ, ఒక బిసి కి కేటాయించినట్లు తెలుస్తోంది. 

1 వరంగల్ వెస్ట్ – గాదె ఇన్నయ్య (రెడ్డి)

2 మల్కాజ్ గిరి – కపిలవాయి దిలీప్ (బ్రాహ్మణ)

3 మెదక్ – జనార్దన్ రెడ్డి (రెడ్డి)

4 దుబ్బాక – చిందం రాజ్ కుమార్ (బిసి మున్నూరు కాపు)

5 సిద్ధిపేట – భవానీరెడ్డి (రెడ్డి)

6 మహబూబ్ నగర్ – రాజేందర్ రెడ్డి (రెడ్డి)

7 చెన్నూరు – పెండింగ్ (రిజర్వు సీటు)

8 మిర్యాలగూడ – పెండింగ్  గవ్వ విద్యాధర్ రెడ్డి ఆశావహుడిగా జన సమితికి ఉన్నారు. 

మిర్యాలగూడలో కాంగ్రెస్ కు బలమైన నేతలు ఉన్నారని ఆ పార్టీ చెబుతున్నది. అందుకే ఆ సీటుపై ఇంకా తేలలేదని తెలిసింది. విద్యాధర్ రెడ్డికి ఇవ్వలేని పక్షంలో జానారెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. మొన్నటికి మొన్న టిఆర్ఎస్ నుంచి వచ్చిన అలుగుబెల్లి అమరేందర్ రెడ్డి కూడా బరిలో ఉన్నారు.