జగన్ ఇంటిముందు దారికే దిక్కు లేదా.. అదే తప్పు మళ్లీ చేస్తున్నారంటూ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రోడ్ల విషయంలో ప్రజల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వం న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఇచ్చిన రుణంతో ప్రస్తుతం రహదారుల పనులు చేపడుతుండగా సీఎం జగన్ ఇంటిముందు నిర్మిస్తున్న రహదారి నిర్మాణం కూడా ఇంకా పూర్తి కాలేదని తెలుస్తోంది. ప్రభుత్వం బ్యాంకు నుంచి రుణంగా తీసుకున్న మొత్తాన్ని గుత్తేదారులకు చెల్లించలేదని సమాచారం.

ప్రభుత్వం ఇతర అవసరాల కోసం ఆ డబ్బును ఖర్చు చేయడంతో గుత్తేదారు సంస్థలు పనులను అంతకంతకూ ఆలస్యం చేస్తున్నాయని సమాచారం అందుతోంది. ఏపీ సర్కార్ 1855 కోట్ల రూపాయల పనులను అప్పగించగా ఇప్పటివరకు కేవలం 115 కోట్ల రూపాయల పనులు మాత్రమే జరిగాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో సులభంగానే అర్థమవుతుంది. సీఎం ఇంటిముందు నుంచి వేయాల్సిన రహదారికి సంబంధించిన పనులు బిల్లులు చెల్లించక మందగించాయని బోగట్టా.

ఏపీ సర్కార్ ఎన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నా రోడ్లపై దృష్టి పెట్టకపోవడం వల్ల తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ రోడ్ల విషయంలో జగన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారనే సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వం రోడ్ల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే రాష్ట్రం ఏ విధంగా అబివృద్ధి అవుతుందని ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

యువతకు ఉపాధి కల్పించడంలో జగన్ సర్కార్ విఫలమవుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఏపీ ప్రభుత్వం విషయంలో కొంతమంది ప్రజలు తీవ్రస్థాయిలో వ్యతిరేకతను కలిగి ఉన్నారు. ఈ వ్యతిరేకత మరింత పెరిగితే ప్రభుత్వానికి నష్టం కలిగే అవకాశాలు అయితే ఉంటాయి. ఏపీ సర్కార్ ఒకవైపు సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే మరోవైపు అభివృద్ధి దిశగా అడుగులు వేయాల్సి ఉంది.