చంద్రబాబు నివాసానికి దగ్గర్లో కత్తితో యువకుడి హల్చల్ (వీడియో)

గుంటూరు జిల్లా ఉండవల్లిలో ఓ యువకుడు కత్తితో హల్ చల్ చేశాడు. తాడేపల్లి మండలం ఉండవల్లిలో కత్తి పట్టుకొని తిరగడంతో అంతా భయభ్రాంతులకు గురయ్యారు. అసలు వివరాలేంటంటే..

ఉండవల్లికి చెందిన ప్రదీప్ కుమార్ జనతాగ్యారేజ్ సినిమాను ఆదర్శంగా తీసుకొని సమస్యలు పరిష్కారం చూపించాలనుకున్నాడు. జనతా గ్యారేజ్ లో సామాన్యులకు ఏ సమస్య వచ్చినా పరిష్కరిస్తారన్నట్టు ఆ సినిమాలో చూపించారు. ప్రదీప్ కూడా జనతా గ్యారేజ్ అని వాట్సాప్ గ్రూపు క్రియేట్ చేశాడు. ఏ సమస్య వచ్చినా పరిష్కరిస్తామని గత కొంత కాలంగా ప్రచారం చేశాడు.

సోమవారం కాస్త రెచ్చిపోయిన ప్రదీప్ కత్తి పట్టుకొని నడి రోడ్డు పై తిరుగుతూ హల్ చల్ చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ప్రదీప్ ను అదుపులోకి తీసుకున్నారు. గతంలోనే ప్రదీప్ అరాచకాలకు పాల్పడ్డ పోలీసులు పట్టించుకోలేదని స్థానికులు తెలిపారు. సీఎం నివాసానికి కొద్ది దూరంలోనే ఘటన జరగడంతో అంతా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కత్తితో హల్చల్ చేసిన వీడియో కింద ఉంది చూడండి.