YSRCP: వైకాపా పార్టీ నుంచి ఇటీవల వరుసగా నేతలందరూ కూడా బయటకు వస్తున్న విషయం తెలిసిందే ఇలా ఎంతోమంది కీలక నేతలు పార్టీ నుంచి బయటకు రావడంతో పార్టీ క్రమక్రమంగా బలహీనపడుతోందని ఇలాగైతే వచ్చే ఎన్నికలలో జగన్ అధికారంలోకి రావడం ఊహ మాత్రమే అంటూ కొందరు పార్టీ నుంచి నాయకులు బయటకు రావడంపై కామెంట్లు చేస్తున్నారు.
ఇలాంటి తరుణంలోనే మాజీ వైకాపా మంత్రి గుడివాడ అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు వైకాపా పార్టీకి నాయకులు బలం కాదని, కార్యకర్తలు మాత్రమే బలమని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం మమ్మల్ని ఎన్ని ఇబ్బందులకు గురిచేస్తున్న వాటిని ఎదుర్కొని ముందుకు పోరాటం చేస్తామని అమర్నాథ్ ఈ సందర్భంగా తెలియజేశారు.
ప్రజాసమస్యలపై తమ పార్టీ పోరాటం ఆగదని, కూటమి ప్రభుత్వం తీసుకునే ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఎప్పటికప్పడు వ్యతిరేకిస్తుంటామని గుడివాడ అమర్నాథ్ అన్నారు.కలసికట్టుగా పనిచేసి పార్టీని మరింత బలోపేతం చేద్దామని పిలుపునిచ్చారు. కార్యకర్తలకు అండగా ఉంటామనీ గుడివాడ అమర్నాథ్ అన్నారు.
ఇలా గతంలో మంత్రిగా పనిచేసిన అమర్నాథ్ ఈ ఎన్నికలలో కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఇలా ఈయన ఓడిపోయినప్పటికీ పార్టీ పరంగా ఎంతో యాక్టివ్ గా ఉంటూ పార్టీ వ్యవహారాలన్నింటిని చూసుకుంటున్నారు. తాజాగా ఈయన విశాఖలోని వైసీపీ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి అమర్నాథ్ తో పాటు విజయసాయిరెడ్డి, బొత్స సత్యనారాయణ అలాగే పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు కూడా పాల్గొన్నారు.