ఇందిరా గాంధీ  మెచ్చిన గీతం

ఈరోజు భారత మాజీ ప్రధాని  శ్రీమతి ఇందిరా గాంధీ శత జయంతి సంవత్సరం.ఇందిరాగాంధీ చేవ కలిగిన నాయకురాలు. ఇంత పెద్ద ప్రజా స్వామ్య దేశాన్ని సమర్ధవంతంగా పాలించిన ఐరన్ లేడీ ఇందిరా గాంధీ.

ఇందిరా గాంధీ కి కవిత్వం అంటే చాలా ఇష్టం. రవీంద్ర నాథ్ టాగూరు  స్థాపించిన శాంతి నికేతన్ ఆమె చదువుకున్నారు. అప్పుడు రవీంద్రుని ప్రభావం ఆమెపై అమితంగా ఉండేది.

రవీంద్ర నాథ్ రాసిన “ఏక్  లా  చలోరే ” గీతం అంటే ఆమెకు ఎంతో ఇష్టం. ఈ గీతాన్ని పడే పడే పాడుకొనేది. రాజకీయాల్లోకి వచ్చిన తరువాత ఎప్పుడైనా మనసు కలత చెందినప్పుడు ఇందిరను ఓదార్చే గీతం ఇదే.  ఈ గీతాన్ని శ్రీమతి ఇందిరా గాంధీ ఇంగ్లీషులో కి ” ఇఫ్ నో వన్ లిజన్స్ టు  యువర్ కాల్ , వాక్ ఎలోన్” అనువదించారు.

టాగూరు గీతాన్ని సంగీత దర్శకుడు, కవి బాలాంత్రపు  రజనీ కాంతారావు తెలుగులోకి అనువదించిన గీతం ఇది. ఆమె స్మృతి కి నివాళిగా  ఈ గీతం .

-భగీరథ