ప్రస్తుతం యువగళం అంటూ పాదయాత్రచేస్తున్న చినబాబు నారా లోకేష్.. మాంచి ఊపుమీదున్నారు. నడుస్తూ.. ప్రసంగిస్తూ.. ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు ఎక్కిపెడుతూ ముందుకుసాగుతున్నారు. ఉన్నంతలో ఇంతవరకూ బాబు హ్యాపీనే! కానీ… ఈ యాత్రలో చినబాబు చేస్తున్న ఒక పని మాత్రం బాబుకు నిద్రలేకుండా చేయడంతోపాటు.. తిరిగి ప్రశ్నించలేని పరిస్థితిని తీసుకువస్తుందని అంటున్నారు బాబు సన్నిహితులు – ఆ వయసు సహచరులు!
అవును… పాదయాత్రలో ఉన్న చినబాబు నడకలో వేగం పెంచారు.. విమర్శల్లో దూకుడు పెంచారు. అంతవరకూ బాగనే ఉంది కానీ.. వెళ్లిన ప్రతీ నియోజకవర్గానికీ అభ్యర్థుల పేర్లు ప్రకటించేస్తున్నారు. ఇప్పుడు ఇదే బాబుని టెన్షన్ పెడుతుందట. కాస్త సమయం తీసుకుని.. స్థానిక సీనియర్లతోనూ – కార్యకర్తలతోనూ చర్చించి.. పార్టీలో కసరత్తులు చేసి అనంతరం ప్రకటించాలనుకున్న అభ్యర్థుల పేర్లు.. చినబాబు సొంతానికి ప్రకటించేస్తున్నారట.
అందుకు ఉదాహరణలుగా… పక్కా ఫుల్ టైం పొలిటీషియన్ అయిన చెవిరెడ్డికి ప్రత్యర్థిగా గల్లా ఫ్యామిలీతో చర్చించి – ఒప్పించాలని బాబు చూస్తుంటే… ఈలోపు పులివర్తి నాని పేరును ప్రకటించడాన్ని చెబుతున్నారు తమ్ముళ్లు! ఇదే క్రమంలో తాజాగా పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పోటీగా చల్లా రామచంద్రారెడ్డిని ప్రకటించడం మరొక చారిత్రక తప్పిదం అంటున్నారు!
ఇలా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ముందూవెనుకా చూసుకోకుండా లోకేశ్ అభ్యర్థులను ప్రకటిస్తుండడం, అది కూడా బలహీనమైన నాయకులను ఖరారు చేస్తుండడంపై బాబు & కో టెన్షన్ పడిపోతున్నారంట. ఇలా ముందస్తు ప్రకటనలు చేయడంవల్ల… జగన్ కి అభ్యర్థుల ఖరారు విషయంలో కావాల్సినంత సమయం, నేతల ఎంపికకు మంచి అవకాశం ఇస్తున్నట్టైందనేది చంద్రబాబు బాద అంట!
దీంతో… తన మాట ఎలాగూ వినే పరిస్థితిలో ప్రస్తుతానికి చినబాబు లేరని.. ఆయన్ని ఎవరైనా ఆపండ్రా బాబు అని చినబాబు కోటరీని వేడుకుంటున్నారంట చంద్రబాబు! దీంతో… పగవాడికి కూడా ఇలాంటి కష్టం రాకూడని ఫీలవుతున్న తమ్ముళ్లు.. లోకేష్ ని కాస్త అదుపుచేయగలరో లేదో వేచి చూడాలి!