చంద్రబాబు ‘ఓటుకునోటు’ వల్ల రాయలసీమ కు జరిగిన నష్టం ఇది

(వి. శంకరయ్య)

తుంగభద్ర నదిపై ఎపి ఎత్తి పోతల పథకం అనుమతి లేకుండా చేపట్టినదని తెలంగాణ మంత్రి హరీష్ రావు నేడు పెద్ద హంగామా చేస్తున్నారు. నీటి సమస్య పక్కన బెడితే ఎన్నికల్లో కాంగ్రెస్ తో టిడిపి జట్టు కట్టడం తో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ఒక ఆయుధంగా ఉపయోగిస్తున్నారు. ఎవరి రాజకీయం వారిది. ప్రతి సందర్భంలోనూ రాజకీయ కారణాలతో అంతిమంగా సీమ ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు.
రాష్ట్ర విభజన జరిగిన తదుపరి తెలంగాణ ప్రభుత్వం కేంద్ర జల సంఘానికి గానీ మంత్రి హరీష్ రావు నేడు కోరుతున్నటు డిపిఆర్ ఎపి ప్రభుత్వంకు సమర్పించకనే 120 టియంసిల సామర్థ్యం తో 36 వేల కోట్ల వ్యయంతో పాలమూరు డిండి ఎత్తి పోతల పథకాన్ని అమలు చేస్తున్నది. ఈ సందర్భంలో ఎపి ప్రభుత్వం అధికారయుతంగా నోరు మెదప లేదు. తుదకు కేంద్ర ప్రభుత్వంకు ఫిర్యాదు చేయలేదు. ఎందుకు?

అదే సమయంలో ఓటుకు నోటు కేసు నమోదు కావడం ఆదరా బాదరగా రాజధాని మారుతున్నది. ఈ సందర్భంగా ఈ అంశంపై రగడ సాగించితే మరింత జటిలం అవుతుందని ముఖ్యమంత్రి గాని తుదకు జలవనరుల శాఖ మంత్రి గాని పట్టించుకోక పోవడంతో తెలంగాణ ఈ పథకం చకచక నిర్మాణం సాగించింది. అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరగాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేయలేదు. తుదకు రైతులు సుప్రీంకోర్టు కోర్టు కెక్కి వచ్చిన తీర్పు మేరకు అప్పటి కేంద్ర మంత్రి ఉమా భారతి సమక్షంలో జరిగిన సమావేశంలో కూడా ఎపి గట్టిగా పట్టుబట్టలేదు. అందరూ కాఫీలు తాగి సమావేశంలో ముగించారు. తెలంగాణ మాత్రం ఇది కొత్త ప్రాజెక్టు కాదని తెలంగాణ ఉద్యమం సమయంలో అప్పటి నేతలు ఊరటగా ఇచ్చిన జీవో లు చూపెట్టి సమస్య ను దాటవేసింది. ఈ అంశంపై ఎపి ప్రభుత్వం కించిత్ చర్యకు దిగ లేదు. ఫలితంగా కేవలం మిగులు వరద జలాల ఆధారంగా వున్న రాయలసీమ కు మరో మారు ద్రోహం జరిగింది. ఏలా గంటే.

 

బచావత్ ట్రిబ్యునల్ కృష్ణ మిగులు జలాలు ఎపి ఉపయోగించుకొని స్వేచ్చ ఇస్తే రెండవ ట్రిబ్యునల్ మిగులు జలాలను కూడా పూర్తిగా పంపకం చేసింది. క్యారీ ఓవర్ కింద 30+120=150 టియంసిలు మాత్రం మిగిల్చింది. ఆ పాటికే ఎపిలో మిగులు జలాల ఆధారంగా hnss gnss వెలుగొండ ప్రాజెక్టులకు 120 టియంసిలు తెలంగాణ లోని కల్వ కురి నెట్టేంపాడు ఎస్ ఎల్ బిసి లకు 77 టియంసిలు కావాలి. కాగా తెలంగాణ కల్వ కురి ని 25 టియంసిల నుండి 40 టియంసిలకు పెంచారు. రెండవ ట్రిబ్యునల్ మాత్రం తెలుగు గంగకు 25 టియంసిలు కేటాయించినది. అంటే ఎపి తెలంగాణ రాష్ట్రాలో విభజన నాటికి నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు 250 టియంసి జలాలు అవసరం కాగా పంపకం కాగా మిగిలి వున్న జలాలు కేవలం 150 మాత్రమే.

 

అయితే విభజన తదుపరి తెలంగాణ శ్రీ శైలం ఎగువ భాగంలో 120 టియంసిల సామర్థ్యంతో పాలమూరు దిండి రెండు ఎత్తి పోతల పథకాలు చేపడితే అప్పుడు ఎపి ప్రభుత్వం గానీ ముఖ్యమంత్రి కాకున్నా జలవనరుల శాఖ మంత్రి గాని నోరు విప్ప లేదు. కేంద్ర ప్రభుత్వం కు ఫిర్యాదు చేయలేదు.

డిండి ప్రాజక్ట్ కు తెలంగాణ ముఖ్యమంత్రి శంకుస్థాపన

ఫలితంగా మిగులు జలాల ఆధారంగా వుండే సీమ ప్రాజెక్టు లకు మున్ముందు ప్రమాదం పొంచి వుంది. నాలుగు ఏళ్ల కాలం మిన్న కున్న ఎపి ప్రభుత్వం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ జీవో జారీ చేస్తే తెలంగాణ మంత్రి యాగికి దిగారు. ఈ రోజు తెలంగాణ మంత్రి కి వున్న ప్రజల ప్రయోజనాలు ఆ రోజు ఎపి ముఖ్యమంత్రి కి గాని తుదకు సీమకు చెందిన టిడిపి నేతలకు లేకుండా పోయింది. ఓటుకు నోటు కేసునుండి బయట పడేందుకు టిడిపి నేతలు నోరు విప్పి ఎదిరించ నందున ఈ రోజు తెలంగాణ మంత్రి కి ఆయుధం ఇచ్చినట్లు అయింది.

(వి. శంకరయ్య, రాయలసీమ యాక్టివిస్టు ఫోన్.  9848394013)