గొల్లపూడిలో టెన్షన్‌ టెన్షన్ .. పోలీసుల హై అలర్ట్

Ex MP Devineni Uma lodged complaint against Kodali Nani

ఏపీలో రాజకీయాల్లో సవాళ్లు, ప్రతిసవాళ్ల పర్వం కొనసాగుతోంది… ఇక, కృష్ణా జిల్లా రాజకీయాలో మరోసారి హాట్ టాపిక్‌గా మారిపోయాయి… మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలపై సీరియస్‌గా స్పందించిన మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నేత దేవినేని ఉమామహేశ్వరరావు.. విజయవాడలో దీక్షకు దిగేందుకు యత్నించారు. దీనితో నిన్న ఉమాను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇదిలా ఉంటే నేడు కూడా గొల్లపూడిలో మరోసారి హై టెన్షన్ వాతావరణం నెలకొంది. అమరావతి ఉద్యమం 400 రోజుల పూర్తి అయిన నేపథ్యంలో టీడీపీ దీక్షకు పిలుపు నిచ్చింది. ఈ క్రమంలో రాజధాని రైతులకు మద్దతుగా దేవినేని ఉమా దీక్షకు సిద్ధమయ్యారు అయితే దేవినేని ఉమా దీక్షకు అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పారు.

అలాగే గొల్లపూడి దీక్షా ప్రాంగణం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. తమ కార్యాలయ ప్రాంగణంలోని నిరసన చేస్తామని టీడీపీ చెబుతోంది. అయితే నిన్నటి ఉద్రిక్త కారణంగా పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ నేపధ్యంలో పోలీసుల వలయంలో గొల్లపూడి సెంటర్, దేవినేని ఉమ నివాసం ఉన్నాయి. సమీపంలోని నివాసాలు ఉండే వారు సైతం తీవ్ర ఇబ్బందులు గురవుతున్నట్టు చెబుతున్నారు. ఒకరకంగా గొల్లపూడిలో కర్ఫ్యూ వాతావరణం తలపిస్తోంది. పోలీసుల ఆంక్షలతో ఉమా నివాసంలోనే దీక్షకు దిగారు.