నాంపల్లి విద్యాశాఖ కమీషనర్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

నాంపల్లి లోని విద్యాశాఖ కార్యాలయం వద్ద ఉద్రిక్తత కొనసాగుతుంది. ప్రభుత్వం ఎయిడెడ్ కాలేజిల  ప్రైవేటు పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఎస్ఎప్ఐ ఆధ్వర్యంలో చేపట్టిన ముట్టడి  తీవ్ర  ఉద్రిక్తతకు దారితీసింది.  ఎయిడెడ్ కాలేజిలకు ప్రభుత్వమే నిధులు కేటాయించాలని ఖాళీగా ఉన్న ఉపాధ్యాయిల పోస్టులను భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు.

 

విద్యార్దులను ఈడ్చుకెళుతున్న పోలీసులు

విద్యాశాఖ  కమీషనర్ కార్యాలయ ముట్టడికి పెద్ద ఎత్తున్న విద్యార్ధిని విద్యార్థులు తరలిరావడంతో కార్యాలయం వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు విద్యార్దులను అదుపుచేయలేకపోయారు. పరిస్థితి అదుపు తప్పడంతో విద్యార్ధి సంఘ నేతలను పోలీసులు అరెస్టు చేసి బేగంబజార్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. విద్యార్దుల ఆందోళనతో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. ఈ కార్యక్రమంలో ఎస్ ఎఫ్ ఐ రాష్ట్ర కార్యదర్శి కోట రమేష్, జావీద్ , నేతలు భాను చంద్ర, రవితేజ, రాజేశ్వర్, ముబీన్, దివ్య, స్నేహ, విద్యార్దులు పాల్గొన్నారు. 
 

నాంపల్లి విద్యాశాఖ కార్యాలయం ముందు ఆందోళన చేస్తున్న విద్యార్ధులు