10 వ తేదీ టెన్షన్…ఏమవుతుంది ఆరోజు ?

ఈనెల 10వ తేదీ విషయమై అన్నీ వర్గాల్లోను టెన్షన్ మొదలైంది. ముఖ్యంగా తెలుగుదేశంపార్టీ, అధికార యంత్రాంగంలో. టెన్షన్ ఎందుకంటే ఆరోజు రాష్ట్ర క్యాబినెట్ సమావేశం నిర్వహించాలని చంద్రబాబునాయుడు నిర్ణయించటమే కారణం. ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నపుడు క్యాబినెట్ సమావేశం నిర్వహించకూడదు.

ఎలక్షన్ కమీషన్ తో ఘర్షణ పడే ఉద్దేశ్యంతోనే చంద్రబాబు కావాలనే క్యాబినెట్ మీటింగ్ పెట్టాలని నిర్ణయించారు. ప్రధానమంత్రి నరేంద్రమోడి, తెలంగాణా సిఎం కెసియార్ క్యాబినెట్ సమావేశాలు నిర్వహిస్తున్నపుడు తనను  మాత్రమే ఎందుకు ఈసి అడ్డుకుంటోందని చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు.

అయితే ఇక్కడ చంద్రబాబు ఓ విషయం మరచిపోయారో లేకపోతే కావాలనే రాద్దాంతం చేయాలని అనుకుంటున్నరో తెలీటం లేదు. పదవిలో నుండి దిగిపోక తప్పదనే సంకేతాలు బలంగా కనిపిస్తున్న నేపధ్యంలో ఈసితో ఘర్షణ పడుతున్నారు. మోడి అంటే దేశప్రధాని కాబట్టి అత్యవసర విషయాలపై క్యాబినెట్ పెడితే పెట్టుండొచ్చు. దేశంలో ప్రధానమంత్రి పదివికి ప్రత్యామ్నాయం లేదు కాబట్టి తప్పదు.

అలాగే కెసియార్ కూడా క్యాబినెట్ సమావేశం పెడుతున్నారంటే తెలంగాణాలో ఎన్నికలు జరిగింది కేవలం పార్లమెంటుకు మాత్రమే. పార్లమెంటు ఎన్నికల్లో కెసియార్ కు సీట్లు వచ్చినా రాకపోయినా మరో ఐదేళ్ళు కెసియారే సిఎంగా ఉంటారు. కాబట్టి ఇపుడు కెసియార్ తీసుకునే నిర్ణయాలకు ఆయనే బాధ్యత వహించాల్సుంటుంది. కానీ ఏపిలో అలాకాదు. రేపటి కౌంటింగ్ లో చంద్రబాబు ఓడిపోతే ఇపుడు తీసుకున్న నిర్ణయాలకు బాధ్యత ఎవరిది ? అందుకే ఏపిలో క్యాబినెట్ సమావేశాలు పెట్టవద్దని అంటున్నారు. అయినా నిర్వహిస్తామంటే….