తెలంగాణ విద్యావేత్తలు, మేధావులు, విద్యార్దులు కలిసి సేవ్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో గన్ పార్క్ వద్ద చేపట్టిన విద్యా విజ్ఞాన యాత్ర ఉద్రిక్తతకు దారి తీసింది. తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలను. కళాశాలలను బతికించుకుందాం, విశ్వ విద్యాలయాలను కాపాడుకుందాం అని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటి ఆధ్వర్యంలో గన్ పార్క్ వద్ద సమావేశం నిర్వహించింది. శాంతి యుతంగా నిరసన తెలుపుతున్న నిరసనకారులపై ఒక్క సారిగా పోలీసులు దాడి చేసి అరెస్టు చేశారు. ఈ యాత్రలో ప్రొఫెసర్ హరగోపాల్, చుక్క రామయ్య, సంధ్య పాల్గొన్నారు. పోలీసులు కండకావరమెక్కి జులుం ప్రదర్శించారని హరగోపాల్ మండిపడ్డారు. విద్యావేత్తలను అరెస్టు చేసిన వీడియో కింద ఉంది చూడండి.
భారీ స్థాయిలో విద్యార్ధులు అక్కడకు చేరుకోవడంతో పోలీసులు వారిని రోడ్డుపై ఈడ్చుకుంటూ గుంజుకుపోయారు. దీంతో విద్యార్దులకు గాయాలయ్యాయి. ప్రొఫేసర్ హరగోపాల్, చుక్క రామయ్యలను పెద్దవారు అని చూడకుండా వారిని గుంజుకుపోయారు. మహిళా విద్యార్దులను కూడా మగ పోలీసులు ఈడ్చుకెళ్లారు. ప్రొఫెసర్ హరగోపాల్ చొక్కా పట్టుకొని ఖాకీలు పోలీసు జీపు ఎక్కించారు. ఖాకీలు కండకావరమెత్తి ప్రవర్తించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నేతలను నిజం చెబితే నేరగాళ్లలా పోలీసు జీపులలో ఎక్కించారని పలువురు మండిపడ్డారు.
విద్యార్దులను అరెస్టు చేసి వాహనాలు ఎక్కించి తీసుకెళుతుండగా నలుగురు విద్యార్ధులు పోలీసుల వాహనం నుంచి జారి కిందపడిపోయారు. దీంతో వారు స్పృహ తప్పి పోయారు. వారిని వెంటనే పోలీసులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
మరి కొంత మందిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఆందోళనకు గన్ పార్క్ వద్ద మేధావులు సమావేశమైన వీడియో కింద ఉంది చూడండి.