ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్పు విషయంలో జూనియర్ ఎన్టీఆర్ స్పందించిన తీరుపై కొంతమంది సోషల్ మీడియాలో ఘాటుగా విమర్శలు చేస్తున్నారు. అయితే తారక్ ను ఈ విధంగా ట్రోల్ చేస్తున్న వాళ్లు టీడీపీ నేతలే కావడం గమనార్హం. అయితే టీడీపీ నేతలు తారక్ ను గెలికి తప్పు చేశారంటూ చాలామంది కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.
జూనియర్ ఎన్టీఆర్ పై ట్రోల్స్ మరింత పెరిగితే టీడీపీ రెండుగా చీలిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. టీడీపీలో జూనియర్ ఎన్టీఆర్ ను అభిమానించే వాళ్లు లక్షల సంఖ్యలో ఉన్నారు. తారక్ కు అవమానాలు జరుగుతున్నా వాళ్లు మాత్రం ఒకింత సహనంతోనే వ్యవహరిస్తున్నారు. తారక్ టీడీపీపై నెగిటివ్ కామెంట్లు చేస్తే మాత్రం ఆ నష్టం ఊహించని స్థాయిలో ఉండే అవకాశం అయితే ఉంది.
తారక్ విషయంలో వ్యవహరిస్తున్న తీరుకు టీడీపీ ఫలితం అనుభవించాల్సి ఉందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. 2024 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి సపోర్ట్ చేయకుండా మరో పార్టీకి సపోర్ట్ చేస్తే పరిస్థితి ఏంటనే ప్రశ్నలు సైతం వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. తారక్ కు బయట జరుగుతున్న ప్రతి విషయం తెలుసు. అయితే వీలైనంత వరకు హద్దులు దాటకుండానే తారక్ వ్యవహరిస్తున్నారు.
ఒక విధంగా తారక్ ఏ తప్పు చేయకపోయినా అన్ని రాజకీయ పార్టీలకు శత్రువుగా మారారు. తెలంగాణలో కేసీఆర్ సర్కార్ సైతం జూనియర్ ఎన్టీఅర్ పై కోపంగా ఉందనే సంగతి తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తే కొత్త పార్టీ పెట్టినా ఆయనకు ప్రజల మద్దతు లభించే ఛాన్స్ ఉంది. జూనియర్ ఎన్టీఆర్ పేరును వాడుకుని రాజకీయాలు చేస్తే మాత్రం అన్ని రాజకీయ పార్టీలు మూల్యం చెల్లించుకోక తప్పదు.