“రాష్ట్రాలు విడిపోయినా భాష విస్తృతమైంది “-యార్లగడ్డ
తెలుగు రాష్ట్రాలు విడిపోయినప్పుడు చాలా బాధ అనిపించింది . కానీ ఇప్పుడు చూస్తే తెలుగు భాష విస్తృతమవుతుందనిపిస్తుంది , ఆ రకంగా చూసుకుంటే మేలే జరిగింది అన్నారు పద్మభూషణ్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ . బుధవారం రోజు హైదరాబాద్ రవీంద్ర భారతిలో వంశీ ఆర్ట్ థియేటర్స్ వారు “కొత్త కథలు 3″ మరియు తెన్నేటి సుధ కథలు ” పుస్తకావిష్కరణ సభ జరిగింది . ఈ సభలో ముఖ్య అతిధి గా పాల్గొన్న లక్ష్మీ ప్రసాద్ మాట్లాడుతూ .. తెలుగు భాష మాట్లాడేవారు ప్రపంచ వ్యాప్తంగా వున్నారు .. నేను అనేక దేశాలు పర్యటిస్తూ భాషాభి వృద్ధి కోసం కృషి చేస్తున్నానని చెప్పారు .
తెలుగు భాష కోసం తెలుగు మహా సభలు నిర్వహించిన ఘనత జలగం వెంగళ రావు గారిది . ప్రపంచ తెలుగు వారి కోసం ఒక అకాడమీ పెట్టిన మాన్యులు నందమూరి తారక రామా రావు గారు ,తెలుగు కు ప్రాచీన హోదా కోసం కృషి చేసిన వ్యక్తి డాక్టర్ వై .ఎస్ రాజశేఖర్ రెడ్డి గారిది . అయితే తెలుగు కోసం ఏమీ చెయ్యంది మాత్రం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రే అని యార్లగడ్డ పరోక్షంగా చంద్ర బాబు నాయుడు ను విమర్శించారు .
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కె .చంద్ర శేఖర్ రావు ప్రతి తరగతిలో తెలుగు తప్పనిసరిగా బోధించాలనే నిబంధన పెట్టారు . మేము ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై .ఎస్ .జగన్ మోహన్ రెడ్డి గారిని కలిసి భాష కోసం కృషి చెయ్యమని విజ్ఞప్తి చేశాము . ఏం చెయ్యమంటారో చెప్పండన్నా అన్నారు , ప్రతి తరగతిలో తెలుగును నిర్బంధంగా బోధించాలని చెప్పాము. అందుకు జగన్మోహన్ రెడ్డి వెంటనే అంగీకరించి అమలు చేస్తానని వాగ్ధానం చేశారని లక్ష్మి ప్రసాద్ చెప్పారు .
ప్రత్యేక అతిధిగా వచ్చిన నటుడు, దర్శకుడు తనికెళ్ళ భరణి “కొత్త కథలు 3″ ను తెన్నేటి సుధ కథలు ” పుస్తకాని కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి కె .శ్రీవాసరావు ఆవిష్కరించారు .తెలుగు భాష కోసం తమవంతు కృషి చేస్తామని ఆయన తెలిపారు .
కొత్త కథలు పుస్తకాన్ని అల్లా శ్రీనివాస రెడ్డి కి అంకిత ఇచ్చారు . తెన్నేటి సుధా కథలు పుస్తకాన్ని యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ కు అంకితం చేశారు ఈ సందర్భంగా భరణి మాట్లాడుతూ 70మంది రచయితలు , రచయిత్రులు కథలు వ్రాశారంటే … నాకెంతో గర్వంగా అనిపిస్తుంది .తెలుగు భాష ఎప్పటికీ సజీవంగానేఉంటుందని అన్నారు .
తెన్నేటి సుధాదేవి కథలను అమెరికాకు చెందిన వంగూరి చిట్టెన్ రాజు ప్రచురించారు . కొత్త కథలు 3 ను అమెరికాలో డాక్టర్ గా పనిచేస్తున్న ఆళ్ళ శ్రీనివాస రెడ్డి ప్రచురించారు .
సభకు ఓలేటి పార్వతీశం అధ్యక్షత వహించారు , కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి కె .శ్రీనివాస రావు ,జమునా రమణారావు , శ్రీమతి ఆకునూరి శారద , శ్రీమతి జయ పీసపాటి , వంశీ రామరాజు పాల్గొన్నారు .
కొత్త కథలను యండమూరి వీరేంద్రనాథ్, మల్లాది వెంకట కృష్ణ మూర్తి , తనికెళ్ళ భరణి , అంపశయ్య నవీన్, రామ చంద్ర మౌళి, రావులపాటి సీతారామ రావు, భగీరథ, సింహ ప్రసాద్, యడవల్లి , డాక్టర్ కె.వి కృష్ణకుమారి , శారదా అశోకవర్ధన్, ఆనందా రామమ్ ,వాసా ప్రభావతి , ముక్తేవి భారతి, బలభద్రపాత్రుని రమణి, ప్రలాప్రగడ రాజ్యాలక్షి,మొదలైన వారు వ్రాశారు .