చంద్రబాబు ఇంటి గోడలను కూడా కెసియార్ కూలగొట్టించారు

నిబంధనలను కాలరాయటం, వ్యవస్ధలను భ్రష్టుపట్టించటంలో చంద్రబాబునాయుడు తర్వాతే ఎవరైనా. తాజాగా కరకట్ట మీద వెలసిన అక్రమ నిర్మాణం ప్రజావేదిక కూల్చివేత నేపధ్యంలో జనాలు చంద్రబాబును అమ్మనాబూతులు తిడుతున్నారు. విషయం ఏదైనా సరే తాను అనుకున్నట్లు చేసేయటం చంద్రబాబుకు అలవాటు. అందుకు ఎన్ని నిబంధనలు అడ్డువచ్చినా లెక్కచేయరు.

ఇదంతా ఎందుకంటే హైదరాబాద్ జూబ్లిహిల్స్ రోడ్డు నెంబర్ 65లో చంద్రబాబుకు సొంత ఇల్లున్న విషయం అందిరికీ తెలిసిందే. ఉన్న పాత ఇంటిని కూలగొట్టి ఆ  స్ధలంలోనే కొత్తగా ఇల్లు కట్టుకోవాలని అనుకున్నారు. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవ ? అన్నట్లుగా పాత ఇంటిని కూలగొట్టేశారు.

అప్పటికే ఏపికి సిఎంగా ఉన్నారు కాబట్టి ఫ్యామిలి మొత్తం హైదరాబాద్ లోనే ఉన్న ప్రభుత్వ గెస్ట్ హౌస్ లో మకాం పెట్టింది. పాత ఇంటిని కూలగొట్టిన తర్వాత కొత్త ఇంటిని కట్టుకోవాలి కదా ? చంద్రబాబు ఆ పనే చేశారు. పునాదులు పూర్తయి గోడలు కూడా లేచాయి. ఆ సమయంలో జిహెచ్ఎంసి ఉన్నతాధికారులు వచ్చి నిర్మాణంలో ఉన్న ఇంటి గోడలను కూల్చేశారు.

ఎందుకు కూల్చేశారంటే ఇంటి నిర్మాణానికి చంద్రబాబు అనుమతులు తీసుకోలేదు. ఎటువంటి అనుమతులు తీసుకోకుండానే ఇల్లు కట్టేస్తున్నారు కాబట్టి. విషయం చంద్రబాబుకు చేరింది. దాంతో చేసేది లేక అప్పటికప్పుడు నిర్మాణ పనులను నిలిపేసి ప్లాన్ జిహెచ్ఎంసిలో సబ్మిట్ చేశారు. ఇంటి నిర్మాణానికి అనుమతులు వచ్చిన తర్వాతే మళ్ళి నిర్మాణాలు మొదలయ్యాయి. దీన్ని బట్టి మీకు ఏమర్ధమవుతోంది ? ఏమిటంటే చంద్రబాబు ఏనాడూ నియమ నిబంధనలను పాటించలేదని.