లోక్ సభ ఎన్నికల్లో నైనా పరువు నిలుపుకోవాలనుకుంటున్న తెలంగాణ కాంగ్రెస్ కు పెద్ద కష్ట మొచ్చింది. అది కూడా పార్టీ పెద్ద లతో. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ హేమాహేమీలంతా మట్టి కరిచారు. తెలంగాణ రాష్ట్ర సమితి పనిగట్టుకుని అసెంబ్లీలోకాంగ్రె్ పెద్ద నాయకుడెవరూ కనిపించకుండా చూడాలని ఏరిపారేసినట్లు పార్టీ వెటరన్స్ అంతా ఓడిపోయారు. ఇంత దారుణమయిన పరాజయం ఎదురువుతుందని కాంగ్రెస్ ఎపుడూ భావించలదు. దానికి తోడు, గతంలోఎపుడూలేనంతా ఈ సారి కాంగ్రె స్ ప్రచారం జరిగింది. చిరవకు స్థానిక ఎన్నికలను తన స్థాయి కాదు అని కొట్టి పడేసిన సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి కూడా బాగా ప్రచారం చేశారు. నిజానికి కాంగ్రెస్ మట్టి కరుస్తుందని పార్టీలో ఎవరూ వూహించలేదు. అలాంటపుడు, తమ తమ నియోజవర్గాల్లో నవాబుల్లగా వెలిగిన వారే. అయితే ఎన్నికల్లో ఓడిపోయినారు గాని, నియోజకవర్గాల్లో ఇప్పటికీ బలమయిన నెట్ వర్క్, జనబలం ధనబలం ఉన్నవారే. ఎన్నికల్లో అపుడపుడూ ఓటమి కూడా ఎదురవుతూ ఉంటుంది. అంతే తప్ప, ఓడిపోయినారాని కె.జానారెడ్డి, డికె అరుణ, కోమటి రెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, బలరామ్ నాయక్, మహమ్మద్ అలీ షబ్బీర్, డాక్టర్ గీతారెడ్డి, రేవంత్ రెడ్డి, సర్వే సత్యనారాయణ, డాక్టర్ మల్లు రవి, రమేష్ రాథోడ్ లను వాల్లని విస్మరించడం కుదరదు.
అందుకే వీళ్లంతా లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. చాలా మంది నియోజకవర్గాలను కూడా ప్రకటించేశారు. అయితే, అసెంబ్లీ సీట్లు వీళ్లకే, లోక్ సభ సీట్లు వీళ్లకేనా అనే విమర్శ పార్టీలో వనిబడుతూ ఉంది. పార్టీ నమ్ముకుని,పనిచేస్తున్నవారికి గుర్తింపు నివ్వరా, లోక్ సభ సీటివ్వరా అని ఇంటర్నల్ గా చాలా మంది నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇది కూడా వాస్తవమే నని చాలా మంది అంగీకరిస్తున్నారు.
ఇక్కడే పార్టికి పెద్ద సమస్య వచ్చిపడింది. వోడిపోయిన సీనియర్లంతా బాగా పేరున్న నాయకులు, డబ్బున్న నాయకులు. టిఆర్ ఎస్ తో సరితూగలేకపోయినా, ఎన్నికల్లో ప్రతిష్టకోసమయిన బాగా డబ్బు ఖర్చ చేయగల సత్తా వున్నారు. ఈ సీనియర్ నాయకులెవరూ అంతకు ముందు అంత ఈజీగా వోడిపోయిన వాళ్లు కాదు. 2014 తెలంగాణ సెంటిమెంట్ ఉధృతంగా ఉన్నపుడు కూడా గెలిచారు. అందువల్ల ఇపుడు వోడిపోయి, మూలన కూర్చోవడం చేయలేరు. అందువల్ల ఏది ఏమయినా లో క్ సభ సీటివ్వాలని వత్తిడి తెస్తారు.
లోకసభ ఎన్నికలు డైరెక్టుగా రాహుల్ ను ప్రధానిని చేసేందుకు జరిగే ఎన్నికలు. ముఖ్యమంత్రి కెసియార్ నాయకత్వంలోని ప్రాంతీయ పార్టీ నుంచి ప్రధాని పదవి పేరుతో ప్రచారం జరగడం కష్టం.డైరెక్టుగా రాహుల్ కు అడిగే ఓటు కాబట్టి, లో క్ సభ ఎన్నికలు కాంగ్రెస్ కు అనుకూలిస్తాయని అందరిలో నమ్మకం ఉంది. అందువల్ల డబ్బు న్న కాంగ్రెస్ మారాజులంతా లోక్ సభ సీటుకోసం పోటీ పడతారు. సీటు తెచ్చుకునేందకు వత్తిడి తెస్తారు. ఒక వేళ సీటురాక పోతే, పార్టీ అభ్యర్థిని ఓడించి తమ సత్తా చూపించగలరు కూడా. ఈ సీనియర్ లలో చాలా మంది టిఆర్ ఎస్ టచ్లో ఉన్నారని కూడా ఆ మధ్య వార్తలొచ్చాయి. సీట్ల పంపిణీ లో కాంగ్రెస్ నాయకత్వంల్ ఈ విషయం కూడా మనసులోపెట్టుకోవాలి.
అందుకే కాంగ్రెస్ డబ్బున్న సీనియర్లు విస్మరించడం కష్టం.దానికి తోడు ఈ ఎన్నిక రాహుల్ గాంధీకి చాలా ముఖ్యం. ఆయన ప్రధాని కావాలంటే తెలంగాణ కాంట్రిబ్యూషన్ అవసరం. ముఖ్యమంత్రి కెసియార్ మాత్రం 17 సీట్లు తమవే అంటున్నారు. అంటే 16 టిఆర్ ఎస్ 1 ఎం ఐఎం.కు. కాంగ్రెస్ కు జీరో. ఇలాంటపుడు డబ్బున్నోళ్లను, పలుకుబడి ఉన్నోళ్లను కాకుండా కొత్తావారిని నిలబెట్టి ఎక్స్ పెరిమెంట్ చేయడం సాహసం అవుతుంది. రాహుల్ ప్రధాని కావాలని, మోదీముక్త భారత్ రావాలని కాంగ్రెస్ భావిస్తున్నపుడు సీనియర్లను విస్మరించడం కష్టం.
అలాగని సీనియర్లకు పెద్ద పీట వేసి తర్వాతి తరాన్ని విస్మరిస్తే వాళ్లు పీల్డ్ లెవెల్లో పనిచేయరు. అవసరమయితే, టిఆర్ ఎస్ లోకి దూకేస్తారు. కాంగ్రెస్ లో ఢిల్లీ యాత్రలు కూడా మొదలయ్యాయి. సీటు కోసం పైరవీలు జోరుగా సాగుతున్నాయి. గతంలో కాంగ్రెస్ ఇన్ చార్జ్ లుగా పనిచేసిన గులామ్ నబీ అజాద్ , దిగ్విజయ్ సింగ్ వంటి వారిని కలవడం మొదలయింది. సీనియర్లు జూనియర్లు అంతా రాహుల్ ముందు మ వాదన వినిపించే అవకాశంలో కోసం ఢిల్లీలో కాపలా కాస్తున్నారు.
సీనియర్ లను విస్మరిస్తే ఒక ప్రమాదం, సీనియర్లకు పెద్ద పీట వేస్తే మరొక ప్రమాదం. ఇదీ కాంగ్రెస్ సతమతవుతున్న పరిస్థితి అని సీనియర్ నాయకుడు, మొన్న ఎన్నికల్లో ఓడిపోయి, ఇపుడు ఒక కొత్త జిల్లా నుంచి ఎంపి సీటు కోసం ప్రయత్నిస్తున్న మాజీ ఎంపి ఒకరు ‘తెలుగు రాజ్యం’ కు చెప్పారు.
‘మొన్న ఎన్నికల్లో ఓడిపోయారని సీనియర్ లను విస్మరించడం సబబుకాదు. ఈ ఎన్నికల చాలా కీలకమయింది. కాబట్టి కొత్తవారితో ప్రయోగానికి 2019 సమయం కాదు. దానికి తోడు ఏవో కారణాలతో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన వారిలో చాలామంది గతంలో లో క్ సభ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన వారే. ఈ విషయం పార్టీ గుర్తించి, లోక్ సభ ఎన్నిలకు అభ్యర్థులను ఎంపిక చేయాలి. అలాగే, కొత్తవారిలో అర్హులకూ అవకాశం కల్పంచాలి,’ అని ఆయన అభిప్రాయపడ్డారు. ‘ అంతిమంగా పార్టీ తీసుకునే నిర్ణయానికి అంతా కట్టుబడే ఉంటారు,’ అని కూడా ఆయన చెప్పారు.