టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ‘యువగళం’ పాదయాత్రలో జూనియర్ ఎన్టీయార్ అభిమానుల నుంచి షాక్‌లు ఎదురవుతున్నాయి. ‘టీడీపీని ఎన్టీయార్ సొంత చేసుకోవాలి.. జై ఎన్టీయార్.. కాబోయే సీఎం ఎన్టీయార్’ అనే నినాదాలతో జూనియర్ ఎన్టీయార్ అభిమానులు హోరెత్తిస్తున్నారు.
మరోపక్క, నందమూరి కుటుంబంలో జూనియర్ ఎన్టీయార్ ఎప్పుడూ ఒంటరేనని, తారకరత్న దశదిన కర్మ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ చేష్టలతో నిరూపితమయ్యింంది. ఈ వ్యవహారంపై జూనియర్ ఎన్టీయార్ అభిమానులు మరింత గుస్సా అయ్యారు. దాంతో, గ్లోబల్ వేదికపై ఎన్టీయార్‌ని ప్రమోట్ చేయాల్సిన ‘కమ్మ’ లాబీయింగ్, సైలెంటయిపోయింది. యంగ్ టైగర్ ఎన్టీయార్ డైహార్డ్ అభిమానులు మినహాయిస్తే, అంతకు ముందు వరకూ ఆయన్ని అభిమానిస్తూ వచ్చిన ఓ వర్గం, పూర్తిగా ఈసారి పక్కన పెట్టినట్లు కనిపిస్తోంది.
ఆస్కార్ వేడుకల్లో యంగ్ టైగర్ ఎన్టీయార్ సందడి చేయనున్నప్పటికీ.. ఆయన్ని సోకాల్డ్ సామాజిక వర్గం లైట్ తీసుకోవడం ఆశ్చర్యకరం. ఇంతకు ముందు ఇదే సామాజిక వర్గం, ఎన్టీయార్‌కి ఆస్కార్ ఖాయం.. అంటూ ఆ స్థాయిలో ప్రచారం చేస్తూ వచ్చింది. టీడీపీని ఎన్టీయార్ స్వాధీనం చేసుకుంటాడన్న భయంతోనే, సదరు సామాజిక వర్గం, ఎన్టీయార్‌ని ఇప్పుడిలా దూరం పెడుతోందా.? ఏమో, అదే కారణం అయి వుండొచ్చన్నది అంతటా వినిపిస్తోన్న వాదన.