మారిన సీన్.! టీడీపీ వేస్ట్.! జనసేన బెస్ట్.!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొలిటికల్ సీన్ అనూహ్యంగా మారింది. టీడీపీ వేస్ట్.. దాంతో పోల్చితే, జనసేన బెస్ట్.! ఈ మాట ఇప్పుడు, టీడీపీ పట్ల ఇన్నాళ్ళూ సానుకూలంగా కొందరు నేతలు అంటున్నారట.! వైసీపీ వైపు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళకూడదనుకుంటున్నవారి ఆలోచన ఇలా సాగుతోందంటూ రాజకీయ వర్గాల్లో చర్చోపచర్చలు జరుగుతున్నాయ్.

ఏం చేసినా, పవన్ కళ్యాణ్‌కి టీడీపీ హార్డ్ కోర్ టీమ్ సపోర్ట్ చేసే అవకాశం లేదన్నది అందరికీ తెలిసిన విషయమే. కానీ, ఆ వర్గమూ ఇప్పుడు కాస్త మెత్తబడుతోంది. ‘మనకోసం నిలబడ్డాడు..’ అనే భావన వారిలో పెరుగుతోంది. కానీ, ఆ వర్గాన్ని నమ్మడానికి వీల్లేదు.! వెన్నుపోటు పొడవడంలో చంద్రబాబుని మించిపోతుంది ఆ వర్గం. వర్గమంటే, ఇక్కడ సామాజిక వర్గం కాదు.! టీడీపీలోని చంద్రబాబు వర్గం.!

‘చంద్రబాబు తనను తాను కాపాడుకోలేకపోయారు..’ అన్న అభిప్రాయం ఇప్పుడు ఆ వర్గంలో బలంగా వినిపిస్తోంది. అలాంటివాళ్ళంతా, ముందు ముందు తమకు వైసీపీ వల్ల ఇబ్బందులు వస్తే ఎలా.? అన్న ఆందోళన వుంది. వారే, జనసేన వైపు చూస్తున్నారు.

టీడీపీకి ఆర్థికంగా వెన్నుదన్నుగా వుంటోన్న ఆ టీమ్, వచ్చే ఎన్నికల్లో జనసేనకూ ఎంతో కొంత అండగా వుండాలని ప్రయత్నిస్తోందిట. టీడీపీని కాదని, జనసేనకు మద్దతిచ్చే పరిస్థితి వుండదుగానీ, కలిసి పని చేస్తాం కాబట్టి.. అనే ఆలోచన చేస్తున్నారట.

నిజానికి, ఈ టీమ్ ఇన్నాళ్ళూ, పవన్ కళ్యాణ్ మీద విషం చిమ్ముతూ వచ్చింది. కానీ, పరిస్థితులు మారాయి. ఓ వైపు చంద్రబాబు అరెస్టు.! ఇంకో వైపు హైవే మీద పవన్ కళ్యాణ్ హంగామా.! ఈ మొత్తం వ్యవహారంలో పవన్ కళ్యాణ్‌దే పై చేయి అయ్యిన సంగతి తెలిసిందే.

అంతా బాగానే వుందిగానీ, చంద్రబాబు తట్టుకోగలిగారు.. టీడీపీ తట్టుకుంటోంది.. చంద్రబాబుకి వచ్చిన పరిస్థితే పవన్ కళ్యాణ్‌కి వస్తేనో.? జనసేనలో ఎవరన్నా మిగులుతారా.? ఛాన్సే లేదు.!