అశోక్ ను అప్పగించేది లేదు..టిడిపి

డేటా లీక్ స్కాంలో కీలక వ్యక్తి అశోక్ తమతో టచ్ లోనే ఉన్నట్లు టిడిపి స్పష్టం చేసింది. అందరూ అనుమానిస్తున్నట్ల  టిడిపి చేస్తోంది. తమతో రెగ్యులర్ గా టచ్ లో ఉన్న అశోక్ ను తెలంగాణా పోలీసులకు అప్పగించేది లేదంటూ టిడిపి నాలెడ్జి సెంటర్ డైరెక్టర్ మాల్యాద్రి స్పష్టంగా చెప్పారు. టిడిపి వ్యవహారం చూస్తుంటే తెలంగాణా ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకునేట్లే ఉంది. అంటే మొత్తం వ్యవహారాన్ని పక్కదారి పట్టించటానికి ఇంతకన్నా మార్గం కూడా లేదు లేండి చంద్రబాబునాయుడుకు.

తమ సానుభూతిపరుల ఓట్లను టిడిపి తొలగించేస్తోందంటూ వైసిపి నేతలు ఎప్పటి నుండో మొత్తుకుంటున్నారు. అయినా ఎన్నికల కమీషన్ ఏమాత్రం పట్టించుకోలేదు. ఈ సమయంలో ఐటి గ్రిడ్స్ సాఫ్ట్ వేర్ దగ్గర ఏపి ప్రజల వ్యక్తిగత వివరాలు ఉందని బయటపడింది. తమకందిన ఫిర్యాదుతో పోలీసులు కంపెనీపై దాడి జరిపితే 3.5 కోట్లమందికి సంబంధించిన వ్యక్తిగత వివరాల డేటా మొత్తం బయటపడింది. దాంతో దాడుల విషయం ముందే తెలుసుకున్న కంపెనీ ఓనర్  అశోక్ తప్పించుకున్నారు.

అశోక్ కోసం తెలంగాణా పోలీసులు నాలుగు బృందాలను విడిపోయి వెతుకుతున్నారు.  అశోక్ ను అమరావతి ప్రాంతంలోనే ఎక్కడో దాక్కున్నట్లు అందరికీ అనుమానం ఉంది. అదే విషయాన్ని టిడిపి నాలెడ్జి సెంటర్ డైరెక్టర్ మాల్యాద్రి కన్ఫర్మ్ చేశారు. అశోక్ తమతో రెగ్యులర్ గా టచ్ లోనే ఉన్నట్లు మల్యాద్రి ధృవీకరించారు. అయితే తెలంగాణా పోలీసులకు అశోక్ ను తాము అప్పగించమని కూడా చెప్పారు. దాంతో తెలంగాణా పోలీసులు ఇపుడేం చేస్తారో చూడాలి.