జనసేన అభిమానులకు దూరమవుతున్న టీడీపీ.. మద్దతిచ్చినా షాక్ తప్పదా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేకపోయినా పవన్ కళ్యాణ్ ను అభిమానించే అభిమానుల సంఖ్య తక్కువేం కాదు. టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తే ఏపీ ఎన్నికల ఫలితాలే మారిపోయే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ నేతలు అత్యుత్సాహంతో చేస్తున్న పనులు ఆ పార్టీకి శాపంగా మారాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

తాజాగా టీడీపీ నేత వంగలపూడి అనిత పవన్ పుట్టినరోజు వరకు మాత్రమే రాష్ట్రంలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేధం అమలులో ఉంటుందేమో అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే అనవసరంగా పవన్ ను టార్గెట్ చేస్తూ టీడీపీ నేతలు రాజకీయాలు చేయడం పవన్ అభిమానులకు అస్సలు నచ్చడం లేదు. చంద్రబాబుకు అనుకూలంగా మాట్లాడటానికి ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఇష్టపడటం లేదనే సంగతి తెలిసిందే.

ఇలాంటి సమయంలో పవన్ ను వివాదంలోకి లాగి టీడీపీ నేతలు తమ పరువు తామే తీసుకుంటున్నారు. వాస్తవానికి ప్లాస్టిక్ ఫ్లెక్సీలను నిషేధించాలనే నిర్ణయాన్ని ఎవరూ వ్యతిరేకించరు. ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై జగన్ సర్కార్ నిషేధం విధించిందే తప్ప ఫ్లెక్సీలపైనే నిషేధం విధించలేదు. జగన్ సర్కార్ ఈ నిర్ణయం విషయంలో వెనక్కు తగ్గుతుందనే ఆలోచన కూడా ఎవరూ చేయడం లేదు.

ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నా తమ పార్టీకే నష్టమని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. టీడీపీకి దూరంగా ఉంటేనే మంచిదని పవన్ కళ్యాణ్ కు ఆయన అభిమానులు సైతం సూచిస్తున్నారు. 2024 ఎన్నికల్లో హంగ్ వస్తే అప్పుడు జనసేన కీలక పాత్ర పోషించే అవకాశం అయితే ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందే పొత్తుల గురించి మాట్లాడటం కరెక్ట్ కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జనసేన టీడీపీకి మద్దతిచ్చినా జనసేన అభిమానులు మాత్రం టీడీపీని నమ్మే పరిస్థితిలో లేరు.