TDP: ఏలూరుకు చెందిన వైసీపీ నేత , మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. కొన్నాళ్ల క్రితం వైసీపీకి ఈయన గుడ్ బై చెప్పారు. కానీ ఏ రాజకీయ పార్టీలలోకి చేరలేదు అయితే ఈయన గత వైసిపి హయాంలో డిప్యూటీ సీఎంగా ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలను తీసుకున్నారు. ఇలా వైసిపి అధికారంలో ఉన్నప్పుడు ఉన్నతమైన పదవులను తీసుకున్న ఆళ్ల నాని వైసిపి ఓడిపోయిన తర్వాత రాజకీయాలకు దూరమయ్యారు.
ఈ విధంగా ఈయన ఏ పార్టీలోకి చేరకుండా రాజకీయాలకు దూరంగా ఉండడానికి కారణం తనకు వ్యక్తిగతంగా రాజకీయాల పరంగా కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయన్న ఉద్దేశంతోనే వైసీపీకి దూరంగా ఉన్నారు. అయితే తాజాగా తాను తెలుగుదేశం పార్టీలోకి చేరబోతున్నారు అంటూ వార్త వైరల్ అవుతుంది. నిజానికి జనసేన పార్టీలోకి వెళ్లాలనుకున్న ఆళ్లనాన్ని ఓ తెలుగు దేశం పార్టీకిలక నేత సలహా మేరకు ఈయనని తెలుగుదేశం పార్టీలోకి తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారట.
ఇక నేడు క్యాబినెట్ మీటింగ్ పూర్తి అయిన తర్వాత ఆళ్ల నాని చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకోబోతున్నారని తెలుస్తోంది.వైఎస్ కు అత్యంత దగ్గర. ఆయన హయాంలోనే మంచి ప్రోత్సాహం లభించింది. ఈ కారణంగానే ఆయన జగన్ వెంట నడిచారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిప్యూటీ సీఎం పోస్టు ఇచ్చారు.
వైయస్ జగన్మోహన్ రెడ్డి తన హయామంలో ఎంతో కీలక పదవిలో కూర్చోబెట్టిన ఆళ్ల నాని ఇప్పుడు ఆ పార్టీకే ద్రోహం చేస్తూ చంద్రబాబు నాయుడు పంచన చేరడంతో పలువురు వైకాపా అభిమానులు ఈ విషయంపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇలాంటి వ్యక్తులు పార్టీ నుంచి వెళ్లిపోయి నిజమైన వాళ్లు మాత్రమే జగనన్న చెంతన ఉంటే మరోసారి జగనన్నకు ఇలాంటి పరిస్థితి రాదు అంటూ కూడా అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.