టిడిపిలో పిఏసి చిచ్చు…చంద్రబాబే కారణమా ?

తాజాగా తెలుగుదేశం పార్టీలో పబ్లిక్ అకౌంట్స్ కమిటి ఛైర్మన్ పదవి చిచ్చు పెట్టేట్లే ఉంది. ఈ పదివి వస్తుందని మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరి, గంటా శ్రీనివాసరావు ఎదరు చూస్తున్నారు. కానీ చంద్రబాబు అనూహ్యంగా పయ్యావుల కేశవ్ కు కట్టబెట్టారు. దాంతో సీనియర్లు చంద్రబాబు మండిపోతున్నారు.

అసెంబ్లీ తరపున నియమించే కమిటిల్లో పిఏసి ఛైర్మన్ చాలా కీలకమైనది. ఈ పదవికి క్యాబినెట్ మంత్రి హోదా ఉంటుంది.  అందుకనే ప్రతిపక్ష ఎంఎల్ఏల్లో ఈ పదవి కోసం పోటీ ఉండటం సహజం.  మొన్నటి ఎన్నికల్లో టిడిపికి ఘోర పరాజయం ఎదురైన తర్వాత పిఏసి ఛైర్మన్ పదవి కోసం ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటున్నారు.

అసెంబ్లీ సమావేశాల్లో కానీ బయటకానీ చంద్రబాబునాయుడు పై వైసిపి ఏ స్ధాయిలో మాటలతో దాడి చేస్తోందో అందరూ చూస్తున్నదే. అసెంబ్లీలో అయితే జగన్ అండ్ కో చంద్రబాబును అస్సలు నోరెత్తనీయకుండా వాయించేస్తోంది. ఇటువంటి సమయంలో అచ్చెన్న, బుచ్చయ్య, నిమ్మల రామానాయుడు మాత్రమే చంద్రబాబుకు రక్షణగా నిలబడుతున్నారు. మిగిలిన సభ్యుల్లో పయ్యావులతో కలుపుకుని ఎవరూ నోరిప్పటమేలేదు.

ఈ పరిస్ధితుల్లో పిఏసి ఛైర్మన్ పదవిని బుచ్యయ్య లాంటి సీనియర్ కు అప్పగిస్తే బాగుండేది. 73 ఏళ్ళ బుచ్చయ్య చౌదరి ఇప్పటికి ఆరుసార్లు ఎంఎల్ఏగా గెలిచిన సీనియర్ సభ్యుడు. బుచ్చయ్యకు ఆ పదవి అప్పగిస్తే తప్పు పట్టేవాళ్ళు కూడా ఎవరూ ఉండరు. అయితే  ఈ విషయాలు చంద్రబాబుకు తెలిసి కూడా కావాలనే పయ్యావులకు కట్టబెట్టారు. పయ్యావుల వైసిపిలోకి వెళతాడనే ప్రచారం జరుగుతోంది. అందుకనే ఆయనకే పిఏసి ఛైర్మన్ పదవిని కట్టబెట్టారని ప్రచారం జరుగుతోంది.