చంద్రబాబునాయుడుకు చీరాల ఎంఎల్ఏ ఆమంచి కృష్ణమోహన్ పెద్ద షాక్ ఇచ్చారు. ఈరోజు ఉదయం ఆమంచి టిడిపికి రాజీనామా చేసేశారు. సరే రాజీనామా చేసిన ఆమంచి చంద్రబాబుపై తీవ్రమైన ఆరోపణలే చేశారులేండి. ఈరోజు ఉదయం లోటస్ పాండ్ నివాసంలో జగన్మోహన్ రెడ్డిని ఆమంచి తన మద్దతుదారులతో భేటీ అయ్యారు. ఆమంచి టిడిపికి రాజీనామా చేస్తారనే ప్రచారం అందరికీ తెలిసిందే.
ఈమధ్య ఆమంచి తన మద్దతుదారులతో సమావేశమయ్యే సమయంలోనే చంద్రబాబు మంత్రి శిద్ధా రాఘవరావును రాయబారానికి పంపారు. అప్పటి రాయబారం విఫలమవ్వటంతో నేరుగా ఆమంచిని తన వద్దకే పిలిపించుకున్నారు. చంద్రబాబుతో దాదాపు గంటపాటు భేటీ అయిన సందర్భంలో తన నిర్ణయాన్ని చెప్పేశారు. అదే సమయంలో జిల్లాలో పార్టీ పరిస్దితిని కూడా వివరించారు.
మొత్తానికి ఈరోజు జగన్ కలసిన ఆమంచి పార్టీకి రాజీనామా చేసేశారు. తొందరలో ఎంఎల్ఏ పదవికి కూడా రాజీనామా చేయనున్నట్లు చెప్పారు. చంద్రబాబుకు పిచ్చిపట్టిందన్నారు. అలాగే 70 ఏళ్ళు దాటిని చంద్రబాబుకు అల్జిమర్స్ ఉండటంతో ఎప్పుడేం మాట్లాడుతారో కడా తెలియటం లేదంటూ మండిపడ్డారు. ఏపి ప్రభుత్వాన్ని అతీతశక్తులు పాలిస్తున్నట్లు విచిత్రమైన ఆరోపణలు చేయటం గమనార్హం. మొత్తానికి ఆమంచికి చీరాలలో అసెంబ్లీ టిక్కెట్టు ఖాయమవ్వటంతో వైసిపిలో చేరనున్నట్లు సమాచారం.