బెయిల్ దొరికినా ఆ విషయంలో సతమతమవుతున్న అచ్చెన్నాయుడు..!

2019 ఎన్నికల్లో వచ్చిన ఓటమి నుండి టీడీపీ ఇంకా కొలుకోలేదని అప్పుడప్పుడు టీడీపీ నాయకుల ప్రవర్తన చూస్తే మనకు అర్ధమవుతుంది. ఎన్నికల్లో వచ్చిన ఓటమి టీడీపీ వాళ్లకు అధికారాన్ని కోల్పోవడమే కాకుండా వాళ్లకు అనేక కష్టాలను తెచ్చి పెట్టింది. తాము అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నాయకులను ఎలా ఇబ్బందులు పెట్టారో ఇప్పుడు అంతకుమించిన ఇబ్బందులు టీడీపీ నాయకులు ఎదుర్కొంటున్నారు. 2019 ఎన్నికల ఓటిమి తరువాత టీడీపీ నుండి చంద్రబాబు ప్రథమంగా వ్యవహరిస్తుండగా అచ్చెన్నాయుడు రెండవ వాడిగా ఉండేవారు. అందుకే అవకాశం దొరికిన ప్రతిసారి వైసీపీని అడ్డగోలుగా తిట్టేవారు.

ఆయన దురుసు ప్రవర్తనే ఇప్పుడు ఆయనకు కష్టాలు తెచ్చాయి. అచ్చెన్నాయుడు గత టీడీపీ ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు.ఆ శాఖలో జరిగిన అవినీతిలో ఏసీబీ వాళ్లు అరెస్ట్ చేశారు. రెండు నెలలకు పైగా జైల్లో ఉన్న అచ్చెన్నకు ఇటీవలే బెయిల్ వచ్చింది.

బెయిల్ వచ్చిన తరువాత మళ్ళీ అచ్చెన్నాయుడు తన పూర్వపు దూకుడును ప్రదర్శిస్తారని టీడీపీ నాయకులు అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆయన ప్రవర్తన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయింది. ఆయన అనారోగ్యం వల్ల ఇలా ప్రవర్తిస్తున్నారా లేక వేరే ఉద్దేశం ఏమైనా ఉందా అనే ధోరణిలో ఉంది. అయితే ఆయన కొన్ని రోజులు సైలెంట్ గా ఉండాలని డిసైడ్ అయినట్టు టీడీపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

త్వరలో చంద్రబాబును కలిసి అచ్చెన్నాయుడు అప్పుడు డిసైడ్ అవుతాడని.. ముందు కొన్ని రోజులు రెస్ట్ తీసుకొన్న తర్వాత ఫ్యామిలీలో కూర్చొని తన రాజకీయ భవిష్యత్ పై ముందుకు వెళ్లాలని అచ్చెన్నాయుడు భావిస్తున్నట్టు ఆయన వర్గం చెప్తోంది. అచ్చెన్నాయుడు సైతం టీడీపీలో ఉంటే కష్టాలు తప్పవని భావిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. ఇప్పుడీ టాపిక్ టీడీపీలో చర్చకు దారితీసింది. వైసీపీ ప్రభుత్వం పెడుతున్న ఇబ్బందులను ఎదుర్కొంటూ టీడీపీలోనే ఉంటారా లేక ఇబ్బందుల నుండి బయటపడటానికి వేరే పార్టీలోకి వెళ్తారా వేచి చూడాలి.