కడప జిల్లాలో ఈ పెద్ద రెడ్డి చుట్టూ బెట్టింగులే…

2014 ఎన్నికల ముందు తెలుగు రాజకీయాల్లో బిగ్గరగా వినిపించిన గొంతుల్లో అప్పటి కాంగ్రెస్ కమలాపురం ఎమ్మెల్యే గండ్లూరు వీరశివారెడ్డి ఒకరు.

కడప జిల్లా కు చెందిన ఒక ‘పెద్ద రెడ్డి’యే అయినా జగన్ ను తీవ్రంగా వ్యతిరేకించేవారు. అలాగే సొంత పార్టీ నేతలను కూడా వదిలే వారు కాదు. 

వైఎస్ రాజశేఖర్ రెడ్డితో సన్నిహితంగా ఉండినా, జగన్ తో ఆయనకు సఖ్యత రాలేదు. బ్రాహ్మణీస్టీల్ పేరుతో గాలిజనార్దన్ రెడ్దితో కలసి జగన్  ఇనప ఖనిజం దోచుకున్నాడని ఆయన ఆరోపణ చేశారు. గాలి జనార్దన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి బ్రాహ్మణీ స్టీల్ కు శంకు స్థాపన చేయించింది, కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ కట్టాలాని కాదు. అది వారి ప్రాముఖ్యం కాదు. ఉక్కు ఫ్యాక్టరీ పేరు చెప్పి అనంతపురం జిల్లా ఓబులాపురం దగ్గిర మైన్స్ కేటాయింపచేసుకుని , ఇనప ఖనిజాన్నిచైనాకు ఎగుమతి చేసి వేల కోట్ల రుపాయాలర్జించారు,’అని ఆయన తీవ్రంగా ఆరోపణ చేశారు.

మరొక సారి ఆయన అప్పటి వైద్య శాఖ మంత్రి డిఎల్ రవీంద్ర ద్రరెడ్డిని క్యాబినెట్ నుంచి తొలంగించాలని డిమాండ్ చేసి సంచలనం సృష్టించారు. జిల్లా సహకార బ్యాంకు ఎన్నికల్లో  కాంగ్రెస్ అభ్యర్థిని కాదని టిడిపి అభ్యర్థికి మద్దతునిచ్చారని వీరశివారెడ్డి ఆరోపించారు. ఇలా ఆ రోజుల్లో ఆయన ఏమ్మాట్లాడినా సంచలనమే. ఈ మధ్య కాలంలో ఆయన వార్తలే లేవు.

 2014 ఎన్నికల ముందు ఆయన  కాంగ్రెస్ వదలి ఎన్నికల ముందు టిడిపి లో చేరారు.

2014 ఎన్నికల్లో పోటీ చేయలేకపోయారు. కమలాపురం నుంచి వైసిపి అభ్యర్థి జగన్ బంధువు రవీంద్రనాధ్ రెడ్డి గెలుపొందారు. టిడిపి అభ్యర్థి పుత్తా నరసింహారెడ్డి ఓడిపోయారు. 

అప్పటి నుంచి ఇప్పటి దాకా కనిపించకుండా వినిపించకుండా మాయమయిన ఆంధ్రప్రదేశ్ ప్రముఖ లీడర్ల లో వీరశివారెడ్డిఒకరయ్యారు. అయితే, ఇపుడాయన మళ్లీ వార్తల కెక్కారు. ఈ సారి బెట్టింగ్ లతో వార్త అయ్యారు.కమలాపురం టిడిపి టికెట్ఖ వీరశివరెడ్డి కి వస్తుందా రాదా అనే దాని మీద ఇపుడు పెద్ద ఎత్తున బెట్టింగ్ లు నడుస్తున్నాయి. అంతేకాదు, ఆయన టిడిపిలో ఉంటారా వెళ్లిపోతారా లేక, వైసిపిలో చేరతారా లేక ఇండిపెండెంటుగా పోటీచేస్తారా… ఇలా ఆయన చుట్టూ బెట్టింగ్ లు నడుస్తున్నాయి.

2018 ఎన్నికల్లో ఆయన టిడిపి టికెట్ ఆశిస్తున్నారు. టికెట్ ఇవ్వకపోతే పార్టీ మారతానని ఆయన హెచ్చరిస్తున్నారు. వీరశివారెడ్డి మూడుసార్లు ఎమ్మెల్యే అయ్యారు. 1994లో ఆయన కమలాపురం టిడిపి ఎమ్మెల్యే. 2004లో కూడా టిడిపి తరఫునే గెలిచారు. 2009లో కాంగ్రెస్ టికెట్ గెలిచారు. టిడిపి ఈసారి పుత్తానరసింహారెడ్డికి టికెట్ ఇవ్వవచ్చనిబాగా వినిపిస్తావుంది. గతంలో పుత్తా వరుసగా మూడుసార్లు ఓడిపోయారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పుత్తా విషయంలో ఒక నిర్ణయానికి వచ్చినట్లు చెబుతారు. ఇక ఆయన పేరు ప్రకటించడమే తరువాయి. అయితే, తనకు సీటు ఇవ్వకపోతే, పార్టీ లో ఉండనని వీరశివారెడ్డి అంటున్నారు. ఆయన ఎటు పోతారు?

గతం మర్చిపోయి, జగన్ తో చేతులు కలపుతాడని ఒక వర్గం అంటున్నది. అయితే, వైసిపిలోకి వీర శివారెడ్డి వెళ్లడని, వెళ్లినా అక్కడ ఆయన టికెట్ వచ్చే అవకాశమేలేనేలేదని కొందరు చెబుతున్నారు. ఇపుడు సిటింగ్ ఎమ్మెల్యే రవీంద్ర నాథరెడ్డి జగన్ మేనమమాయే. ఆయన 73వేల ఓట్ల ఆధిక్యతతో 2014 ఎన్నికల్లో గెలిచారు. ఆయనన్ను కాదని మరొకరికి టికెట్ ఎలా ఇస్తారు.

వీర శివారెడ్డి మధ్య ఒకటి రెండు దఫాలు ముఖ్యమంత్రి చంద్రబాబును కలసి టికెట్ విషయం ప్రస్తావించారు. అయితే సిఎం స్పందన అంత అనుకూలంగా లేదని దాని వల్లే ఆయన బాధపడ్తున్నారని ఆయన సన్నిహితులు తెలుగురాజ్యంకు చెప్పారు.

మొత్తానికి కమలాపురం జిల్లాలో ఉత్కంఠ రేపుతూ ఉంది. ముఖ్యంగా వీరశివరారెడ్డి టిడిపిలో ఉంటారా, బయటకు వెళ్లిపోతారని అన చర్చ జోరుగా సాగుతుంది. తమాషా ఏమిటంటే, ఆయనకు టికెట్ వస్తుందా రాదా అనేదానిమీద కూడదా పద్ద ఎత్తున బెట్టింగ్ సాగుతూ ఉంది.