మైకు దొరికింది.. చూపించే ఛానల్ ఉంది.. రాసే పత్రిక ఉండనే ఉంది.. చదివే జనాలు ఉన్నారు.. అని ఏది బడితే అది మాట్లాడితే… అవి బౌన్స్ బ్యాక్ అయ్యి… “గుయ్” మనే శబ్ధం వచ్చే అవకాశాలు.. ఈ సోషల్ మీడియా రోజుల్లో పుష్కలంగా ఉంటాయి! ఈ విషయం కొంతమంది టీడీపీ లీడర్లు మరిచిపోతున్నారు.. ఫలితం అనుభవంలోకి వచ్చినా అర్థం చేసుకోలేకపోతున్నారు!
కొద్ది రోజుల క్రితం గుంటూరు జిల్లా తెనాలిలో వైఎస్సార్ రైతు భరోసా కార్యక్రమం సందర్భంగా ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దమ్మూ ధైర్యం ఉంటే టీడీపీ – జనసేన 175 స్థానాల్లో వేర్వేరుగా పోటీ చేయాలని సవాల్ విసిరారు. ఈ సవాల్ పై ఇప్పటివరకూ చాలా మంది టీడీపీ నేతలు, జనసేన నేతలు స్పందించినా… అడిగిన ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పలేదు!
ఇలా అడిగిన దానికి తప్ప అన్నింటికీ సమాధానం చెప్పే లిస్ట్ లో తానూ ఉన్నానంటూ మైకుల ముందుకు వచ్చారు నెల్లూరు టీడీపీ నేత ఆనం వెంకట రమణారెడ్డి! దమ్ముంటే టీడీపీ 175 స్థానాల్లో పోటీ చేయాలని అడగడానికి జగన్ ఎవరు? అంటూ మొదలు పెట్టడమే ప్రశ్నతో మొదలుపెట్టారు!
అడిగిన ప్రశ్న… చేస్తారా.. చెయ్యారా అని? దానికి సమాధానం చెప్పలేని ఆనం రమణారెడ్డి… మమ్మల్ని ప్రశ్నించడానికి నువ్వెవరు అంటూ ఎదురు ప్రశ్న వేశారు? ప్రశ్నకు ప్రశ్నే సమాధానం కాబోలు! అనంతరం… “మా పార్టీ అనుభవమంత లేదు నీ వయసు.. నువ్వు డైపర్స్ వేసుకునేటప్పుడే పుట్టిన తెలుగుదేశం పార్టీని నువ్వేందయ్యా ఛాలెంజ్ చేసేది? అంత సీన్ నీకు లేదు” అంటూ సందర్భంలేని విధంగా స్పందించారు!
అయితే ఈ మాటకే ఇప్పుడు కౌంటర్స్ మీద కౌంటర్స్ వేస్తున్నారు నెటిజన్లు!
“మీ పార్టీ పుట్టేటప్పటికి డైపర్స్ వేసుకునే వయసున్న పిల్లాడు.. నేడు మిమ్మల్ని 23కి పరిమితం చేసాడా… వావ్”!
“జగన్ చిన్నప్పుడు డైపర్స్ వేసుకుంటే… ఇప్పుడు జగన్ వల్ల కలుగుతున్న ఒత్తిడికి మీరు, చంద్రబాబు ఈ వయసులో కూడా డైపర్స్ వేసుకుంటున్నారంటగా”!
“మీ పార్టీ అనుభవం అంత వయసు లేని కుర్రాడు.. మీ పార్టీ మనుగడకు ముప్పుగా మారాడా… సిగ్గు సిగ్గు”!
ఇలా… రకరకాల కామెంట్లతో టీడీపీ నేతలను – ఆనం రమణారెడ్డిని ఆటాడుకుంటున్నారు నెటిజన్లు!